ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చేది ఆరోజే.. అభిమానులకు ఇదే శుభవార్త అంటూ?

మెగా కోడలు ఉపాసన( upasana ) తన మంచితనంతో అందరు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

ఉపాసన బిజినెస్ విషయంలో రాణిస్తూ కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సొంతం చేసుకుంటున్నారు.

చరణ్ కు తగ్గ భార్యగా ఉంటూ ఉపాసన కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.ఉపాసన ప్రస్తుతం గర్భవతి కాగా ఉపాసన డెలివరీ డేట్ ఇదేనంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న వార్తల ప్రకారం మరికొన్ని గంటల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.ఈ నెల 20వ తేదీన ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తలు నిజమో కాదో తెలియాల్సి ఉంది.

మెగా ఫ్యామిలీలోకి మరో మెంబర్ ఎంట్రీ ఇస్తే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.ఇందుకు సంబంధించి మెగా ఫ్యామిలీ నుంచి స్పష్టత వస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

కొణిదెల ఇంట మూడో తరం రాకకు రేపే శుభ ముహూర్తం అని ఒక పోస్టర్ వైరల్ అవుతోంది.అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణం స్వామి నాయుడు పేరుతో పోస్టర్ వైరల్ అవుతోంది.మెగా కుటుంబంలో బుడి బుడి అడుగులకు శ్రీకారం.

ఆ చిరంజీవి చిరు చిరు మురిపాలకు ఇదే ఆరంభం అని పేర్కొన్నారు.రామ్ చరణ్ ఉపాసన దంపతుల బిడ్డకు దేవదేవుళ్ల ఆశీర్వాదం అని పోస్టర్ లో చెప్పుకొచ్చారు.

అభిమానులై మనం చేసుకోవాలి అంబరాన్నంటేలా సంబరం.చరణ్ ఉపాసన దంపతుల బిడ్డ పేరుపై మెగాభిమానులు సమీప దేవాలయాల్లో పూజలు చేయాలని కోరుకుంటున్నామని పోస్టర్ లో పేర్కొన్నారు.వైరల్ అవుతున్న వార్త నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఉపాసన తనకు పుట్టబోయే పిల్లలకు పేర్లు ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది.మెగా ఫ్యామిలీలోకి పాప ఎంట్రీ ఇస్తారో లేక బాబు ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉంది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు