Upasana : 60 ఏళ్ల వయసులో అత్తమ్మ కొత్త అవతారం.. ఉపాసన పోస్ట్ వైరల్?

మెగా కోడలు ఉపాసన ( Upasana ) వృత్తిపరమైనటువంటి జీవితంలో ఎంత బిజీగా ఉంటారో వ్యక్తిగత జీవితంలో కూడా అంతే బిజీగా ఉంటారు.

ఇక ఈమె తన వ్యక్తిగత జీవితంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇలా ఉపాసన ఎప్పటికప్పుడు తన వృత్తిపరమైనటువంటి విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటారు.

ఇకపోతే మహిళా దినోత్సవం సందర్భంగా ఈమె తన అత్తమ్మతో కలిసి దిగినటువంటి ఫోటోలను షేర్ చేశారు ఇక ఈ ఫోటోలలో సురేఖ ( Surekha )అత్త అంజనమ్మ ( Anjanamma ) కూడా ఉండటం విశేషం.ఉపాసన అత్తయ్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మ కిచెన్స్( Attamma Kitchens ) అనే కొత్త బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇంట్లో తయారు చేసే రుచులను ప్రతి ఒక్కరు ఆస్వార్దించాలన్న ఉద్దేశంతో ఈమె అత్తమ్మ కిచెన్స్ అంటూ కొత్త బిజినెస్ ప్రారంభించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ఉపాసన అత్తయ్య అమ్మమ్మతో కలిసి దిగినటువంటి ఫోటోలను షేర్ చేస్తూ తన అత్తమ్మ కిచెన్స్ గురించి పలు విషయాలను వెల్లడించారు.ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా అత్తగారు 60వ సంవత్సరంలో వ్యాపారవేత్తగా అవతారం ఎత్తారని తెలిపారు.మీ అభిరుచిని అనుసరిస్తూ.

Advertisement

మాలో ఇంకా స్పూర్తిని నింపుతున్న అత్తమ్మా మీకు వందనాలు.ఇలానే దేశంలోని అత్తమ్మలు, అమ్మలు అంతా కూడా వ్యాపారవేత్తలుగా మారితే.

దేశం ఎంత సంపన్నంగా ఉంటుందో ఆలోచించండి.ఎక్కువమంది మహిళలు పనిచేస్తూ వారి ఫ్యాషన్ ఫాలో అయ్యేలా చేద్దాం అంటూ ఉపాసన పోస్ట్ చేశారు.

ఇలా తన అత్తయ్యతోను అలాగే అమ్మమ్మతో కలిసి ఉన్న ఫోటోలను ఈమె షేర్ చేయడంతో ప్రతి ఒక్క అత్తా కోడళ్ళు కూడా ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు..

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు