ఫుల్ గా తాగి గ్యాంగ్ స్టార్ ని వదిలేసిన పోలీసులు

ఒక గ్యాంగ్ స్టార్ ని అరెస్ట్ చేస్తే ఎంత బందోబస్తు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అలాగే పోలీసులు కూడా అలాంటి వారిని రిమాండ్ కి తరలించే సమయంలో, అలాగే కోర్టుకి తీసుకెళ్ళే సమయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.

వారు తప్పించుకోవడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు.అసలు విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో ఓ గ్యాంగ్ స్టార్ట్ ని పోలీసులు ఫుల్ గా తాగి వదిలేసినా ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టార్ లు చాలా ఎక్కువ మంది ఉంటారు.బద్దన్ సింగ్ బద్దూ అనే గ్యాంగ్ స్టార్ మీద యూపీలో 34 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

వాటిలో నాలుగు హత్య కేసులు కూడా ఉన్నాయి.బద్దన్ సింగ్ ప్రస్తుతం ఓ హత్యకేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.

Advertisement

అయితే మరో కేసులో విచారణ కోసం అతన్ని గజియాబాద్ కోర్టులో హజరు పరచడానికి తీసుకెళ్ళిన పోలీసులు మార్గమధ్యలో ఓ హోటల్ దగ్గర తన అనుచరులు పార్టీ ఇస్తున్నారని చెప్పి వ్యాన్‌ను ఆపారు.కస్టడీలో ఉన్నది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అనే విషయం కూడా మరిచి, పోలీసులంతా కలిసి ఫుల్లుగా తాగేశారు.

ఇదే అవకాశంగా భావించిన గ్యాంగ్ స్టార్ బద్దూ అక్కడి నుంచి పారిపోయాడు.

ఇదిలా ఉంటే పోలీసుల నిర్లక్ష్యం వలన బద్దూ తప్పించుకోవడంని సీనియర్ పోలీస్ అధికారులు సీరియస్ గా పరిగణించి అతనిని కోర్ట్ కి తీసుకెళ్ళిన పోలీసులు అందరిని అరెస్ట్ చేసారు.అలాగే వారికి సహకరించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అయితే బద్దూ తప్పించుకొని దేశం విడిచి పారిపోయే అవకాశాలు ఉన్నాయని, ఇప్పుడు యూపీ పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement