హీరో కాక ముందు భాను చందర్ ఎలాంటి పనులు చేసేవాడో తెలుసా.. ?

భానుచందర్.తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.

అంతే కాదు సొంతంగా ఫైట్ చేసే అతి కొద్దిమంది తెలుగు హీరోల్లో భానుచందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

తొలినాళ్ళలో హీరోగా అనేక సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు భానుచందర్.

భానుచందర్ తండ్రి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో సుపరిచితుడు ఆయన మరెవరో కాదు మాస్టర్ వేణు.రోజులు మారాయి, మాంగళ్య బలం, తోడికోడళ్లు, సిరి సంపదలు, ప్రేమించి చూడు, మేలుకొలుపు, వింతకాపురం వంటి సినిమాలకు మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం చేసాడు.

ఈ సినిమాలన్నీ కూడా మ్యూజికల్ హిట్ అని చెప్పుకోవచ్చు.ఇక తనలాగానే తన కొడుకు కూడా వేణు సంగీత దర్శకత్వం చేయాలని భావించాడు మాస్టర్ వేణు.

Advertisement
Untold Story Of Hero Bhanu Chandar, Bhanu Chandar, Master Venu, Rojulu Mray, Man

కానీ బాలచందర్ మాత్రం తన తల్లి ఆశయం మేరకు తెరవెనుక కాకుండా తెర ముందే ఉండాలనుకున్నాడు.అందుకే నటుడిగా స్థిరపడ్డాడు కానీ హీరో కాకముందు అనేక పనులు చేసాడు.

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గిటారిస్ట్ గా బాను చందర్ పని చేయడం.తన తండ్రికి అన్ని రకాల సంగీత వాయిద్యాలపై మంచి పట్టు ఉంది కానీ గిటార్ వంటి వెస్ట్రన్ పరికరంపై మాస్టర్ వేణు కి అవగాహన లేదు.

అందువల్లనే దానిపై పట్టు సాధించాడు భాను చందర్.ఇక తాను తండ్రిలా కాకుండా పాశ్చాత్య మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నానని భాను చందర్ వేణు కి చెప్పడం తో ముంబై లోని ప్రసిద్ధ సంగీత దర్శకుడైన నౌషాద్ దగ్గర అసిస్టెంట్ గా పని లో పెట్టించాడు వేణు.

Untold Story Of Hero Bhanu Chandar, Bhanu Chandar, Master Venu, Rojulu Mray, Man

ఆ సమయంలో నౌషాద్ అసిస్టెంట్ గులాం అలీ పాకీజా ఒక సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.కానీ అనుకోకుండా ఆ సినిమా మధ్యలో ఉండగానే గులాం చనిపోయాడు దాని వల్ల ఆ పని అంతా కూడా నౌషాద్ పూర్తి చేయాల్సి వచ్చింది.ఆ సమయంలోనే భానుచందర్ దగ్గర అసిస్టెంట్ గా చేరాడు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

రీ రికార్డింగ్ సమయంలో నౌషాద్ పియానో వాయిస్తుంటే భానుచందర్ పక్కనే నిలబడి నోట్స్ రాస్తూ గిటార్ వాయించేవాడు.అలా ఆరు నెలల పాటు పని చేసాడు.భానుచందర్ ఆ తర్వాత మద్రాసు తిరిగి వెళ్ళిపోయాడు.

Advertisement

కొన్నాళ్ళపాటు తండ్రితో కలిసి పని చేశాడు.బెంగళూరులో పిబి శ్రీనివాస్ దగ్గర కూడా సంగీత కచేరీలు చేశాడు.

ఆ తర్వాత సినిమాల్లో హీరోగా మారడం జరిగిపోయాయి.

తాజా వార్తలు