ఎందుకో జుబేదా..నిన్ను తెలుగు పరిశ్రమ ఇంకా గుర్తించడం లేదు.. !

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి.మంచి టైమింగ్ ఉన్న కమెడియన్.సినిమా అంటే పిచ్చి .

అందుకే అప్పుడప్పుడు హీరో అవతారం కూడా ఎత్తుతూ ఉంటాడు.వైవిధ్యమైన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉన్న ఎందుకో ఇప్పటికి శ్రీనివాస్ రెడ్డు కి మంచి సినిమా పడలేదు అనే భావం ప్రేక్షకుల్లో ఉంది.

సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఇంకా మంచి పాత్రల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.ఆలా అని శ్రీనివాస్ రెడ్డి కి సినిమాలు లేవు అని అనుకోవడానికి లేదు.

ఏడాదిలో దాదాపు 5 నుంచి 8 సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు.ఇప్పటికే కెరీర్ మొత్తం మీద 97 సినిమాల్లో నటించాడు.అయినా కూడా ఇంకా ఎదో వెలితి.

ఈ మధ్య కాలం లో బింబిసారా సినిమాలో జుబేదా పాత్రలో అద్భుతంగా నటించాడు.సినిమాను మలుపు తిప్పే పాత్రలో శ్రీనివాస్ రెడ్డి నటన అమోఘం.

Advertisement

ఇక పాన్ ఇండియా వ్యాప్తం గా హిట్టు కొట్టిన కార్తికేయ 2 సినిమాలో సైతం శ్రీకృష్ణుడి భక్తుడిగా సినిమా మొత్తం కనిపించే పాత్రలో ఎంతో చక్కటి నటనను చూపించాడు.ఈ సినిమాలో అనుపమ, నిఖిల్ పాత్రలతో పాటు ట్రావెల్ అయ్యే ఫుల్ లెన్త్ రోల్ శ్రీనివాస్ రెడ్డి కి లభించింది.

ఇంత ఘన విజయం సాధించిన సినిమాల్లో నటించిన కూడా ఇప్పటికి ఒక్క సరైన పాత్ర పడలేదు.

అయన డైలాగ్ డెలివరీ, హావ భావాలు, డైలాగ్ డెలివరీ ఎంతో విభిన్నంగా ఉంటాయి.మంచి పాత్ర పడితే బెస్ట్ కమెడియన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.కేవలం నటుడిగా మాత్రమే ఉండాలనే కోరిక లేకపోవడం కూడా ఇతగాడికి ఒక మైనస్ పాయింట్ అని చెప్పచ్చు.

ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి ఒక నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ కూడా.ఇకనైనా డేట్స్ ఇవ్వడానికి కూడా తీరిక లేని వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ వెనకాల పడుతున్న మన టాలీవుడ్ సినీ పరిశ్రమ శ్రీనివాస్ రెడ్డి లోని టాలెంట్ ని గుర్తించి మరిన్ని మంచి జుబేదా లాంటి పాత్రలు లభించాలని కోరుకుందాం.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు