Gandhi manohar : సారీ నేను ఇప్పుడు డైరెక్టర్ ని కాదు .. కేవలం రచయితని

ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా తీసినా కూడా ఆ తర్వాత వారు పెద్ద పెద్ద కలలు కంటూ ఉంటారు.

అంతేకాదు తాము డైరెక్టర్ అని తనకు ఇక తిరుగు లేదని ప్రతి సినిమా తమపైనే నడిచినట్టు బిల్డప్పులు కూడా ఇస్తుంటారు.

ఉన్నదానికి లేని దానికి ఈ కలర్ కోటింగ్ ఇచ్చి షుగర్ కోటింగ్ తో అందరి ముందు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తూ సినిమాలను సైతం చేస్తూ ఉంటారు.కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం పూర్తిగా అందుకు విరుద్ధంగా ఉంటుంది.

నాలుగైదు సినిమాలకు దర్శకత్వం వహించిన కొత్తగా ఎవరైనా కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అని అడిగితే డైరెక్టర్ గా నాకు అవకాశాలు తగ్గాయి ప్రస్తుతం రచయితగా అవకాశాల కోసం వెతుక్కుంటున్నాను అని చాలా సింపుల్ గా మనసులో ఏమీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు.అతడే డైరెక్టర్ గాంధీ మనోహర్.

సారీ.నాకు పెళ్లయింది అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు గాంధీ.

Advertisement

ఆ తర్వాత ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరం చూసాం.ఆ సినిమా విడులా అయ్యాక మొదటి రోజు నుంచి అన్ని థియేటర్లు మంచి కలెక్షన్స్ తో, హౌస్ ఫుల్ గా నడిచాయి.

ఈ సినిమా హిట్ కావడం అతడికి తీవ్రంగా నష్టం కలిగించింది.పేరులో ఉన్న భూతు సినిమాలో లేకపోయినా కొంత సోకాల్డ్ వర్గం అదొక బి గ్రేడ్ మూవీ గా తీర్పు ఇచ్చేయడం తో చిన్న హీరోలు కూడా అతడికి డేట్స్ ఇవ్వలేదు.

ఆ తర్వాత ప్రయోగాత్మకంగా ప్లీజ్.నాకు పెళ్లయింది అనే పేరుతో మరొక సినిమా తీస్తే పట్టుమని ఫస్ట్ డే షో కి కూడా 10 మంది వెళ్లలేదు.

దాంతో డైరెక్టర్ గా ఆయన ఎంతో బాగా పడ్డాడు.అయినా కూడా అలుపెరగని పోరాటం చేసి శివాజీ ని హీరోగా పెట్టి రెండు సినిమాలు తీశాడు.అవి కూడా పోయాయి దాంతో ఇక ఆయనకు సినిమాలపై డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ పోయింది.కానీ ఆయనలో ఒక మంచి రచయిత ఉన్నాడు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
మోకాలి నొప్పులు నివారించాలంటే.. ఇలా చెయ్యండి..!

అంతకు ముందు రాఘవేంద్రరావు , బాపు వంటి వారి వద్ద పనిచేశాడు.ఆ అనుభవం తోనే ప్రస్తుతం రచయితగా ప్రయత్నిస్తున్నాడు.

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ లో రచయితల కొరత ఉంది అలాగే మంచి డిమాండ్ ఉంది.నాలుగు కోట్ల వరకు డబ్బులు తీసుకునే విజయేంద్ర ప్రసాద్ లాంటి గొప్ప రచయితలు ఉన్నారు.

దాంతో ఆయనకు రచయితగా మంచి డిమాండ్ వస్తుందని అతడు ఎదురు చూస్తున్నాడు.