డజన్ల కొద్దీ నటులున్న అర్జున్ కుటుంబం లో మీకెంత మంది తెలుసు ?

సౌత్ ఇండియన్ స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

మా ఊరి గోపాలుడు సినిమా నుంచి నేటి వరకు అర్జున్ ఎన్నో మంచి సినిమాల్లో నటించి తెలుగు వారికీ అభిమాన హీరో అయిపోయాడు.

అయితే అతడు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో ఒక స్టార్ గా కొనసాగుతన్నాడు.మాతృ రాష్ట్రం కర్ణాటక.

అయితే అర్జున్ కుటుంబం లో ఉన్న నటుల సంఖ్య తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.డజన్ల కొద్దీ హీరోలు, నటులు ఉన్నారు అయన ఫ్యామిలీ లో.ఇక అర్జున్ తండ్రి పేరు శక్తి ప్రసాద్ అయన ఒక నటుడు.రెండు వందల సినిమాల్లో నటించాడు.

శక్తి ప్రసాద్ పెద్ద కుమారుడు పేరు కిషోర్ సర్జా.

Untold Actors In Arjun Family, Kishore Sarja, Shakti Prasad, Arjun Family, Star
Advertisement
Untold Actors In Arjun Family, Kishore Sarja, Shakti Prasad, Arjun Family, Star

కిషోర్ దర్శకుడిగా పలు సినిమాలకు పని చేసాడు.ఇతడి భార్య పేరు అపర్ణ కిషోర్.వీరి సంతానం సూరజ్ సర్జా..

సంగీత దర్శకుడిగా పని చేసాడు.ఇక శక్తి ప్రసాద్ రెండవ కుమారుడు అర్జున్ సర్జా.

అర్జున్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సినిమాల్లో పని చేసిన విషయం మనకు తెలిసిందే.ఇక అర్జున్ భార్య నివేదిత కూడా హీరోయిన్.

నివేదిత తండ్రి రాజేష్ కూడా కన్నడ నాట పెద్ద నటుడు.నివేదిత కజిన్ అను ప్రభాకర్ కూడా నటి గా కొనసాగుతుండగా, ఆమె భర్త రఘు ముఖర్జీ కూడా నటుడు కావడం విశేషం.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

అను ప్రభాకర్ మొదటి భర్త తల్లి జయంతి.ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గతం లో హీరోయిన్ గా తెలుగు లో అనేక సినిమాల్లో నటించింది.

Untold Actors In Arjun Family, Kishore Sarja, Shakti Prasad, Arjun Family, Star
Advertisement

జయంతి మాత్రమే కాదు ఆమె మొదటి భర్త తెలుగు సినిమాకు మొదటి కమెడియన్ అయినా పేకేటి శివరామ్.ఇక అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య హీరోయిన్ కాగా రెండవ కూతురు అంజనా ప్రొడ్యూసర్ గా మారింది.అర్జున్ మేనల్లుళ్లు అయినా భరత్, పవన్ తేజ సైతం యాక్టర్స్.

వీరు కాకుండా శక్తి ప్రసాద్ ఏకైక కూతురు అమ్మాజీ కి ఇద్దరు కొడుకులు.వారి పేర్లు చిరంజీవి సర్జా, ధృవ్ సర్జా.

ఇద్దరు కన్నడలో పెద్ద నటులుగా కొనసాగుతున్న టైం లోనే చిరంజీవి కన్ను మూసాడు.చిరంజీవి భార్య మేఘన కూడా హీరోయిన్.

మేఘన తండ్రి యాక్టర్ కం డైరెక్టర్, తల్లి యాక్టర్ కం నిర్మాత.ఇక ధృవ్ ప్రస్తుతం బాగా బిజీ యాక్టర్.

ఇంకా వీరు మాత్రమే కాదు వీరు, వీరి పిల్లలు, పిల్లల పిల్లలు అంటూ వందల మంది సర్జా కుటుంబం నుంచి రావచ్చు .

తాజా వార్తలు