అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే సీజన్ 2 టైటిల్ సాంగ్ ని విడుదల చేసిన ఆహ

హైదరాబాద్, 27 సెప్టెంబర్: నందమూరి బాలకృష్ణ పేరు తెలియని వారుండరు.

భారతీయ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్న ప్రజల కథానాయకుడు బాలకృష్ణ, ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు బాలయ్య.

ఒక నటుడిగా, ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగా ఎంతో మందిని అలరించిన బాలయ్య బాబు, ఆహ వారి అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే షో ద్వారా హోస్ట్ గా మనందరి మదిని కొల్లగొట్టిన నటసింహం, ఇప్పుడు "అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే" సీసన్ 2 ద్వారా మరోసారి అభిమానులను ఊర్రూతలూగించనున్నారు.సరికొత్తగా షోస్ ను లాంచ్ చేసే ఆహ, అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే 2 కోసం టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది.

Unstoppable With NBK Season 2 Title Song Released By Aha , Unstoppable With NBK,

పాట గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, "రోల్ రైడ మరియు మహతి స్వర సాగర్ సమకూర్చిన ఈ పాట నాకు ఎంతో బాగా నచ్చింది.ఆహ అభిమానుల అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.

"అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే షో టైటిల్ సాంగ్ రచన మరియు గాయకుడు రోల్ రైడ అవడం విశేషం, అలాగే ఈ పాట కు సంగీతం మహతి స్వర సాగర్ సమకూర్చారు.ఆహ సీజన్ 2 ని అభిమానుల ముందరికి 2022 అక్టోబర్ లో తీసుకురాబోతుంది.

Advertisement
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

తాజా వార్తలు