రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన అన్ స్టాపబుల్ పవన్ ఎపిసోడ్?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ లభించిందో మనకు తెలిసిందే.

ఇప్పటికే మొదటి సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తికాగా రెండవ సీజన్ అంతకుమించి ఉండేలా మేకర్స్ ప్లాన్ చేశారు.

ఇక రెండవ సీజన్ కూడా ముగింపు దశకు చేరుకుంది.ఈ క్రమంలోనే ఆన్ స్టాపబుల్ సీజన్ 2 లో భాగంగా చివరి ఎపిసోడ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు.

ఈ ఎపిసోడ్ కూడా రెండు భాగాలుగా ప్రసారం కానుంది.ఇప్పటికే మొదటి భాగం ప్రసారం అయ్యి అత్యధిక స్థాయిలో వ్యూస్ రాబట్టింది.

Unstoppable Pawan Episode With Record Views ,unstoppable ,pawan Episode ,balayya

గతంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రావడంతో ఈ ఎపిసోడ్ ప్రసారమైన సమయంలో ఆహా సర్వర్ డౌన్ అయిన విషయం మనకు తెలిసిందే.అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న మేకర్స్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎలాంటి అంతరాయం రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకున్నారు.అయినప్పటికీ కొంత పాటి అంతరాయం ఏర్పడింది.

Advertisement
Unstoppable Pawan Episode With Record Views ,Unstoppable ,Pawan Episode ,balayya

ఇక పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో భాగంగా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా చర్చించారు.ముఖ్యంగా మూడు పెళ్లిళ్ల గురించి కూడా ఈయన ప్రస్తావించారు.

Unstoppable Pawan Episode With Record Views ,unstoppable ,pawan Episode ,balayya

ఇలా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను ఎన్నో ప్రశ్నలు అడిగి ఆయన నుంచి సమాధానాలు రాబట్టారు.అయితే ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.ఇక ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఆహాలో అందుబాటులోకి వచ్చింది.

అయితే ఈ ఎపిసోడ్ 24 గంటలలో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది.కేవలం 24 గంటల్లోనే ఏకంగా 150 మిలియన్ వ్యూస్ రాబట్టడం విశేషం.

ఇలా ఈ స్థాయిలో వ్యూస్ రాబట్టింది అంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఏ స్థాయిలో అభిమానులు ఎదురు చూశారో అర్థం అవుతుంది.ఇక మొదటి ఎపిసోడ్ ఈ స్థాయిలో వ్యూస్ రాబట్టడంతో రెండవ ఎపిసోడ్ కోసం అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు