చంద్రబాబుకే షాకిస్తున్న పర్యటనలు.. మరీ ఇంత క్రేజా..?

2024 ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు.ఈ మేరకు ఇప్పటికే ఆయన పర్యటనలు షురూ చేశారు.

అయితే ఈ పర్యటనలు చంద్రబాబుకే షాకిస్తున్నాయి.ఎందుకంటే ఆయన ఊహించని విధంగా ప్రజల నుంచి స్పందన లభిస్తోంది.

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కారణంగా ప్రజలు చంద్రబాబు టూర్లకు వెల్లువలా తరలివస్తున్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించేది పాజిటివ్ ఓటింగేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

సీఎం జగన్ తరహాలో పూర్తిగా తాడేపల్లికి పరిమితం కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు చంద్రబాబు ఇటీవల ఉత్తరాంధ్ర నుంచి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో ఆయనకు అపూర్వ స్పందన లభించింది.

Advertisement

తర్వాత విశాఖలోనూ ఇదే సీన్ రిపీటైంది.గోదావరి జిల్లాలలోనూ చంద్రబాబు పర్యటనలకు ప్రజలు పోటెత్తారు.

దీంతో జన స్పందన చూసి చంద్రబాబు ఇదంతా కలయా.నిజమా అనే మీమాంశలో ఉన్నారు.

టీడీపీ నేతలు కూడా చంద్రబాబు టూర్లకు స్పందన చూసి మురిసిపోతున్నారు.గత మూడేళ్లలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధేమీ లేదు.

భారీ స్థాయిలో అప్పులు చేస్తూ వివిధ పథకాల కోసం చేస్తున్న ఖర్చు తప్ప ప్రత్యేకంగా ప్రజలకు వైసీపీ వల్ల ఒరిగిందేమీ లేదు.దీంతో ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

మరోసారి చంద్రబాబుకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు.అందువల్లే బాబు పర్యటనలకు క్రేజ్ పెరిగిందని పరిస్థితులను చూస్తే అర్ధమవుతోంది.

Advertisement

అటు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ చంద్రబాబు పర్యటనకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి చంద్రబాబు వెళ్తే అక్కడ విద్యార్ధులు అంతా రోడ్ల మీదకు వచ్చి బాబు రావాలి బాధలు పోవాలి అంటూ నినాదాలు చేశారు.ద్రవిడ యూనివర్శిటీలో కనీస సదుపాయాలు లేవని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు చంద్రబాబు ముందు గోడు వెళ్లబోసుకున్నారు.

బాబు ఇదే ఊపులో ఏపీ అంతటా తిరిగితే తమ పార్టీకి మరింత ఆదరణ పెరుగుతుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అటు గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు అధికార పార్టీ నేతలపై తిరగబడుతుండటం గమనించదగ్గ విషయం.

తాజా వార్తలు