కేఆర్ విజ‌య కుటంబం నుంచి వ‌చ్చి హీరోయిన్లు ఎంత మందో తెలుసా?

పాత త‌రం న‌టీమ‌ణుల్లో ఒక‌రు కేఆర్ విజ‌య‌.సావిత్రి,జ‌మున‌, కాంచ‌న‌మాల‌తో స‌మానంగా పేరు ప్ర‌ఖ్యాతులు సాధించింది ఈ న‌టీమ‌ణి.

త‌న అంద చందాల‌తో పాటు చ‌క్క‌టి న‌ట‌న‌తో అందిరినీ ఆక‌ట్టుకునేది.అప్ప‌ట్లో యువ‌కుల ఆరాధ్య దైవంగా మారింది.

ఎన్నో పౌరాణిక‌, జాన‌ప‌ద‌, సాంఘిక చిత్రాల్లో న‌టించి మెప్పించింది.తెలుగు చిత్రాల్లో దేవ‌త పాత్ర అన‌గానే అప్ప‌ట్లో ఒకేఒక్క పేరు గుర్తుకు వ‌చ్చేది.

అదే కేఆర్ విజ‌య‌.టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తో ఎన్నో చిత్రాల్లో న‌టించింది.

Advertisement
Unknown Family Members Of K R Vijaya, KR Vijaya, KR Savitri, Vastala, KR Vijaya

అంద‌మైన రూపు, చ‌క్క‌టి న‌వ్వు ఆమెకు ఎన్నో సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చేందుకు ఉప‌యోగ‌ప‌డ్డాయి.తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన‌ప్ప‌టి నుంచి మంచి ఆఫ‌ర్ల‌తో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు.

తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందారు.కేఆర్ విజ‌య ఒక్క‌రే కాదు.

త‌న కుటుంబంలో ఎంతో మంది న‌టీన‌టులున్నారు.వారెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం!

Unknown Family Members Of K R Vijaya, Kr Vijaya, Kr Savitri, Vastala, Kr Vijaya

ప్ర‌ముఖ న‌టి వ‌త్స‌ల విజ‌య‌కు స్వ‌యానా సోద‌రి.తిరువ‌నంతపురంలో పుట్టిన ఈమె తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లో న‌టించింది.ప‌లు టీవీ సీరియ‌ళ్ల‌లోనే యాక్ట్ చేసింది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

తెలుగులో స‌ర్ప‌యాగం సినిమాలో హీరోయిన్‌గా చేసింది.ప్ర‌స్తుతం త‌మిళ చిత్రాల్లో త‌ల్లి గెట‌ప్‌లు వేస్తోంది.

Advertisement

ఈమె మ‌రో చెల్లి కేఆర్ సావిత్రి.

మల‌‌యాళంలో మంచి న‌టి.త‌మిళంలోనూ ఎన్నో చిత్రాలు చేసింది.ఈమె కుమార్తెలు అనుష‌, రాగ‌సుధ కూడా న‌టులే కావ‌డం విశేషం.

అనుష మల‌‌యాళం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోయిన్.క‌న్న‌డ‌లోనూ ఎన్నో చిత్రాల్లో న‌టించింది.

రాగ‌సుధ సైతం మల‌యాళం, క‌న్నడలో ప‌లు చిత్రాలు చేసింది.తెలుగు సినిమాల్లోనూ అడుగుపెట్టింది.

అనుష‌, రాగ‌సుధ ఇద్ద‌రూ వివాహం చేసుకుని కుటంబంతో గ‌డుపుతున్నారు.త‌ల్లి సావిత్రి సినిమాల‌తో పాటు సీరియ‌ళ్ల‌లో న‌టిస్తున్నారు.

త‌న చెల్లెళ్లు, వారి పిల్ల‌లు సినిమా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టినా త‌న కూతురును మాత్రం సినిమా రంగంలోకి తీసుకురాలేదు విజ‌య‌.బిడ్డ హేమ‌ల‌త‌ను ఉన్న‌త విద్య చ‌దివించింది.

తాజా వార్తలు