మాస్ సినిమాలకు పెట్టింది పేరు వి వి వినాయక్.. ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం

వెండితెరపైన హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో సత్తా చాటాడు దర్శకుడు వి.వి.

వినాయక్.

తన స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్‌గా వినాయక్ కొనసాగుతున్నారు.

అక్టోబర్ 9 వినాయక్ బర్త్ డే సందర్భంగా ఆయన తీసిని చిత్ర విశేషాలు తెలుసుకుందాం.సీనియర్ డైరెక్టర్ సాగర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పని చేసిన వినాయక్.

జూనియర్ ఎన్టీఆర్ ‘ఆది’ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు.రెండో చిత్రం నందమూరి బాలకృష్ణతో తీశాడు.

Advertisement

ఈ సినిమా తాను అనుకున్న స్థాయిలో ఆడలేదని, కానీ, తాను తీసిన సినిమాల్లో, తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ ‘చెన్నకేశవరెడ్డి’ అని చెప్తుంటాడు వినయ్.ఇక మూడో సినిమా ‘దిల్’.

ఈ చిత్రంతో రాజు ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ అయి దిల్ రాజు అయిపోయారు.రాజు పేరు దిల్ రాజు మారడంలో వినాయక్ పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనమే సృష్టించింది.వి.వి.వినాయక్ తన నాలుగో చిత్రం తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవితో తీశాడు.‘ఠాగూర్’ సినిమా తర్వాత వినయ్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడని చెప్పొచ్చు.

ఈ సినిమా ద్వారా మెగాస్టార్ పైన తనకున్న అభిమానాన్ని చూపించాడు వినాయక్.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో ‘సాంబ’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘బన్ని’, విక్టరీ వెంకటేశ్‌తో ‘లక్ష్మీ’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘యోగి’ సినిమా తీశాడు.ఇకపోతే తన స్టైల్ ఆఫ్ యాక్షన్ కు కామెడీ జోడించి తీసిన సినిమాలు మాస్ మహారాజ రవితేజ ‘కృష్ణ’, తారక్ ‘అదుర్స్’ సినిమాలు.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

రామ్ చరణ్‌తో ‘నాయక్’ సినిమా తీసిన డైరెక్టర్ వినాయకర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలిచిత్రం ‘అల్లుడు శ్రీను’కు దర్శకత్వం వహించారు.ఇక బాస్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెం.150’కి కూడా వినాయకే డైరెక్టర్.వినాయక్ ప్రస్తుతం ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు.

Advertisement

ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో కాగా ఈ చిత్రం ద్వారా వినాయక్, సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ కాబోతున్నారు.

Watch Chennakesava Reddy | Prime VideoWatch Chennakesava Reddy

తాజా వార్తలు