ఆర్ఆర్ఆర్ సినిమా పై ప్రశంసలు కురిపించిన కేంద్ర మంత్రి.. స్పందించిన చిత్రబృందం!

రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌.

ఈ సినిమా మార్చి 25 వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల అయ్యి పది రోజులు కావడంతో ఏకంగా 750 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి, 1000 కోట్ల కలెక్షన్ల దిశగా అడుగులు వేస్తోంది.ఇలా ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి డంతో ఈ సినిమాపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే RRR సినిమా పై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ భారతదేశ అతిపెద్ద సినిమా RRR సినిమా తొలి ఏడు రోజుల్లోనే రూ.750 కోట్లు వసూలు చేసినట్లు విన్నాను.ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తున్నట్లే ఇండియన్ ఎకానమీ కూడా రికార్డులను బద్దలు కొడుతుందనీ ఆయన వెల్లడించారు.

ఈ క్రమంలోనే 2021- 22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 418 డాలర్ల ఎగుమతులు చేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలియజేశారు.ఈ విధంగా ఈ సినిమా పై కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించడంతో చిత్రబృందం స్పందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా RRR చిత్రబృందం స్పందిస్తూ.

Advertisement

థ్యాంక్యూ పీయూష్ గోయల్‌ జీ.దేశ అభివృద్ధిలో మా సినిమా భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాం.మాస్ డి మాలాగే మరి ఇతర సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ చిత్రబృందం తెలియచేశారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు