జగన్ పై ఉండవల్లి కామెంట్స్... నమ్మి ప్రజలు జగన్ కు ఓటు వేశారు

వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఉండవల్లి కామెంట్ చేశారు.

రాజమండ్రిలో ఈ రోజు ఒక సమావేశం లో మాట్లాడిన ఉండవల్లి ముందుగా సి ఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జగన్ కు అభినందనలు అని తెలిపారు.

అలానే జగన్ ఇటీవల మాట్లాడుతూ అవినీతి రహిత పాలన అందిస్తాను అన్న వ్యాఖ్యలను కూడా ఉండవల్లి స్వాగతించారు.ఎదో చంద్రబాబు మీద నెగిటివ్ ఓటింగ్ తో జగన్ అధికారంలోకి రాలేదని, ఒకవేళ నెగిటివ్ ఓటింగ్ అయితే గనుక ఇంత భారీ మెజారిటీ అనేది సాధ్యం కాదని ఉండవల్లి అన్నారు.

అలానే ఈ ఎన్నికల్లో జగన్ కు 50 శాతం ఓట్ల తో గెలవడం చాలా గొప్ప విషయం అని అన్నారు.

Undavlli Comments On Jagan

విప్లవాత్మక మార్పులకు జగన్ వ్యాఖ్యలు నాంది అని అలానే ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన వారు తక్కువ,గెలిచిన వారు గొప్పవాళ్ళు అని అనుకొనవసరం లేదు అని ఉండవల్లి స్పష్టం చేశారు.ప్రజలకు జగన్ ఎదో చేస్తాడు అని నమ్మి ప్రజలు ఓటు వేసి జగన్ ను గెలిపించారు అని, జగన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి అంటూ ఉండవల్లి కామెంట్ చేసారు.అలానే ప్రభుత్వ సలహాదారుగా అజయ్ కల్లామ్ నియామకం అనే నిర్ణయం పెద్ద హర్షనీయం అని, మొదటగా ఇసుక మాఫియా ను అరికట్టాలి అని ఉండవల్లి కోరారు.

Advertisement
Undavlli Comments On Jagan-జగన్ పై ఉండవల్లి కా�

అలానే గత ప్రభుత్వం పై కూడా ఉండవల్లి కామెంట్స్ చేశారు గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పై పలు ప్రశ్నలు సంధించి కామెంట్ చేసిన ఉండవల్లి ఈ రోజు ఆయన నిర్వహించిన ఒక సమావేశం లో కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు.

Advertisement

తాజా వార్తలు