కోడలిపై అత్యాచార యత్నానికి పాల్పడిన మామ..!

భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ కోడలు తన మామకు చెప్పింది.

మగ పిల్లాడు పుట్టడం లేదని భర్త సూటిపోటి మాటలతో నిత్యం నరకం చూపిస్తున్నాడని చెప్పడంతో కామంతో రగలిపోయిన భర్త తండ్రి తనతో ఉండమని నీచపు మాటలు మాట్లాడి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

దీంతో ఆ మహిళ పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది.దీంతో ఆడపిల్లలను చూడటానికి వచ్చిన మామయ్య ఇంట్లో కోడలు ఒంటరిగా ఉండటం చూసి అత్యాచారానికి యత్నించాడు.

Ap, Guntoor, Uncle, Attempted To Rape, Daugter In Law -కోడలిపై అ

ఈ మేరకు ఆ మహిళ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.గుంటూరులోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్న యువతిని అక్కడే పనిచేస్తున్న యువకుడితో పరిచయమైంది.

Advertisement

ఇద్దరూ ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో నాలుగేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు.కాపురం సాఫీగా సాగినా ఆమెకు ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో అసలు సమస్య మొదలైంది.

మగబిడ్డ కావాలని రోజూ భర్త సూటిపోటి మాటలు మాట్లాడేవాడు.నిత్యం నరకం చూపించేవాడు.

భర్త ప్రవర్తన గురించి మామకు చెబితే భర్తలో మార్పు వస్తుందని భావించిన భార్య తన మామకు జరిగిన విషయం చెప్పింది.దీంతో కామంతో రగిలిపోయిన మామ తనతో ఉండు మగ పిల్లాడు పుడతాడని లైంగిక వేధింపులు మొదలు పెట్టాడు.

తనతో ఉంటే అంతా తానే చూసుకుంటా అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడే వాడు.ఈ విషయం భర్త, అత్తతో చెబితే ఈ రోజుల్లో ఇదంతా మూములే అంటూ సెలవిచ్చారు.

జాయింట్ పెయిన్స్‌తో బాధ‌ప‌డుతున్నారా..అయితే ఇవి తీసుకోవాల్సిందే.!

రోజురోజుకీ అత్తింటి వేధింపులు ఎక్కువవడంతో కోడలు పుట్టింటికి వెళ్లిపోయింది.పిల్లలను చూడాలనే సాకుతో వచ్చిన మామ ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

Advertisement

దీంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

తాజా వార్తలు