విదేశీ విద్యకు తగ్గని డిమాండ్.. పదేళ్లలో భారీగా ఎడ్యుకేషనల్ లోన్స్

ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించేందుకు అంతా ఉత్సాహం చూపుతుంటారు.దీని కోసం చాలా మంది బ్యాంకులకు ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ఆశ్రయిస్తారు.

అయితే మన దేశంలో గత పదేళ్లలో విదేశాల్లో ఉన్నత విద్య కోసం భారీగా ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకున్నట్లు తేలింది.గత పదేళ్లలో 4,61,017 ఎడ్యుకేషన్ లోన్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి విద్యార్థులు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది.

వారిలో 42,364 మంది విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు లోన్స్ తీసుకున్నారు.

విదేశీ విద్య కోసం గత పదేళ్లలో విద్యార్థులు తీసుకున్న రుణాల వివరాలను పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ పంచుకుంది.ప్రతి ఏటా విదేశీ విద్య కోసం విద్యార్థులు తీసుకునే రుణాల సంఖ్య పెరుగుతూ వస్తోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.2012-13 ఏడాదిలో 22 వేల మంది ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు.ఈ సంఖ్య ఉండేకొద్దీ పెరుగుతూ వస్తోంది.

Advertisement

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలని భావించే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని చెప్పడానికి ఇది ఉదాహరణగా భావించవచ్చు.కరోనా విజృంభించిన 2019 సంవత్సరంలో కూడా 56,930 మంది విదేశీ విద్య కోసం రుణాలు పొందారు.2020లో 69,183 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటే, 2021లో ఈ సంఖ్య 69,898కి చేరింది.ఓ వైపు కోవిడ్ విజృంభించినా, మరో వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం చూపుతున్నా విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.2018-19 ఏడాదిలో రూ.237.13 కోట్లు, 2019-20 ఏడాదిలో 298.97 కోట్లు, 2020-21 ఏడాదిలో 243.64 కోట్లు, 2021-22 289.82 కోట్ల విలువైన రుణాలను బ్యాంకులు విద్యార్థులకు అందించాయి.

ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)
Advertisement

తాజా వార్తలు