ఢిల్లీకి పోతాం అని ఐపీఎస్‌లు క్యూ కట్టడానికి కారణం మీరు కాదా!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపి, టీడీపి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.2019 ఎన్నికలలో తీవ్ర ఓటమిని మూటగట్టుకున్న టీడీపి కొత్త ప్రభుత్వాన్ని డే 1 నుండి టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.

కొన్ని అంశాలలో జగన్ సర్కార్ నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగానే ఉన్న వాటికి ప్రచారం దక్కక మూలన పడ్డాయి.

అంతేకాకుండా వైసీపికి వరుసగా న్యాయస్థానంలో చుక్కెదురవుతుంది.ప్రభుత్వం న్యాయస్థానాలలో వరుసగా ఇలా ఎదురు దెబ్బలు తినడం వల్ల ప్రజలలో నెగిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మరి దీనిపైన ప్రస్తుతానికి వైసీపి ఏం చేయాలన్న అంశంపై ఇంకా ఓ స్పష్టతకు వచ్చినట్లు కనిపించడం లేదు.

Devineni Uma Comments On Ycp, Devineni Uma , YS Jagan Govt, IPS Officers, Delhi,

అయితే వైసీపిని మరింతగా డిఫెన్స్ లోకి నెట్టేందుకు టీడీపి రంగం సిద్ధం చేసింది.అందులో భాగంగా వైసీపి సర్కారు కొందరికి మాత్రమే బాధ్యతలను అప్పచెబుతూ మిగతా వారిని గాలికి వదిలేస్తుందని దీని కారణంగానే ఈ ఏడాదిలో ఐదుగురు ఐపీఎస్‌లు ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమైతే తాజాగా మరో ఇద్దరు దరఖాస్తులతో సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా వైసీపి సర్కారుపై నిప్పులు చెరిగారు.

మరి దీనిపై వైసీపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement
చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

తాజా వార్తలు