సనాతన ధర్మంపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. అలాంటి కామెంట్లు చేస్తూ?

కోలీవుడ్ హీరో, రాజకీయ నేత ఉదయనిధి స్టాలిన్( Udhayanidhi Stalin ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఉదయనిధి స్టాలిన్ తాజాగా ఒక సందర్భంలో సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా ఆ వాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్( Tamilnadu Progressive Writers Artist Association ) సనాతన నిర్మూలన సదస్సును నిర్వహించగా ఉదయనిధి స్టాలిన్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.

సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని ఆయన చెప్పుకొచ్చారు.సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడం మాత్రమే కాదని పూర్తిగా తొలగించాలని ఉదయనిధి స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.సనాతన ధర్మం అనేది తిరోగమన సంస్కృతి అని ఆయన చెప్పుకొచ్చారు.

సనాతన ధర్మం మనుషులను కులాల పేరుతో విభజించిందని ఉదయనిధి స్టాలిన్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.మహిళా సాధికారతకు, సమానత్వానికి సనాతన ధర్మం( Sanatana dharma ) వ్యతిరేకమని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

అయితే ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్ల గురించి బీజేపీ నేతలు మండిపడుతున్నారు.తమిళనాడు రాష్ట్రంలోని కొందరి నిజస్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని ఆయన చెప్పుకొచ్చారు.తాము నిర్వహించిన కాశీ, తమిళ సంగమం కార్యక్రమంను రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఆదరించిందని ఆయన పేర్కొన్నారు.

సనాతన ధర్మం శాశ్వతమైనదని ధర్మేంద్ర ప్రసాద్( Darmendra Prasad ) వెల్లడించడం గమనార్హం.ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల నష్టం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు.మరో బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్( Tamilnadu CM Stalin ) ఇండియా కూటమిలో కీలకం వ్యవహరిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్ల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అనవసర వివాదాలలో చిక్కుకునేలా ఉదయనిధి స్టాలిన్ కామెంట్లు చేయడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఉదయనిధి స్టాలిన్ పొలిటికల్ గా మరింత సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని భావిస్తున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు