'ఉబర్‌' ఊబిలో కస్టమర్‌... 21 కి.మీ రైడ్‌కి రూ.1,500 బిల్లు?

ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ క్యాబ్స్( Uber cabs ) గురించి తెలియని వారు వుండరు.తాజాగా ఢిల్లీ( Delhi )లో ఓ కస్టమర్‌కు ఉబర్‌ షాక్‌ ఇచ్చింది.

అవును, మీరు విన్నది నిజమే.21 కిలోమీటర్ల రైడ్‌కి గాను ఏకంగా రూ.1,500 లకుపైగా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది.దాంతో కస్టమర్‌ ఫిర్యాదు చేయడంతో తప్పిదం గ్రహించిన కంపెనీ అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించింది.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిత్తరంజన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసానికి ఓ మహిళ రైడ్‌ బుక్‌ చేసుకొనే క్రమంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం( Indira Gandhi International Airport ) నుంచి చిత్తరంజన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసానికి ఓ మహిళ రైడ్‌ బుక్‌ చేసుకుంది.ఈ క్రమంలో ఆమె తన గమ్య స్థానం చేరుకోగానే ఉబర్‌ యాప్‌లో చూపిన ప్రారంభ మొత్తం నుంచి రూ.1,525కి మారింది.దాంతో అవాక్కయి సదరు డ్రైవర్ తో సంబాషించింది.

ఫలితం లేకపోవడంతో ఆ మొత్తాన్ని చెల్లించేసిన ఆమె తర్వాత కంపెనీని సంప్రదించి దీనిపై ఫిర్యాదు చేశారు.జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌( GPS tracking system )లో లోపం వల్లే ఇలా ఎక్కువ మొత్తంలో బిల్లు వచ్చిందని ఉబర్ ప్రతినిధి ఆమెకు తెలిపారు.

Advertisement

అంటే ఆమె సరిహద్దు దాటనప్పటికీ ఉత్తరప్రదేశ్ అంతర్రాష్ట్ర ఛార్జీ వసూలు చేసినట్లు అందులో తేలింది.బిల్లులో మున్సిపల్ కార్పొరేషన్ పన్ను కూడా రెండుసార్లు చేరడం కొసమెరుపు.కాగా బిల్లింగ్‌లో లోపాన్ని గుర్తించిన కంపెనీ బాధితురాలికి డబ్బును తిరిగి చెల్లించింది.ఉబెర్‌ క్యాష్ వాలెట్‌లో రూ.900 రీఫండ్ చేసింది.మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లకు ప్రయాణించేవారి కోసం ఉబర్‌ తమ సేవల్ని మెరుగుపర్చింది.

ఉబర్‌ రిజర్, పికప్ డైరెక్షన్స్‌, వాకింగ్‌ ఈటీఏస్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది.ఉబర్‌లో కస్టమర్లు ఇప్పుడు 90 రోజుల ముందుగానే రైడ్‌ బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించిన విషయం అందరికీ తెలిసిందే.

ఎన్ని చేసినా ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరం.

వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?
Advertisement

తాజా వార్తలు