తెలంగాణా కార్మికుల కోసం.. యుఏఈ ప్రతినిధుల బృందం

పొట్ట చేత పట్టుకుని ఎన్నో కలలు కంటూ విదేశాలలో ఉండి డబ్బు సంపాదించాలి అనుకుని వెళ్లి అక్కడ నానా కష్టాలు పడుతున్న తెలంగాణా కార్మికులు ప్రస్తుతం అక్కడ కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంది.యుఏఈ లో అమల్లో ఉన్న క్షమాభిక్ష (అమ్నెస్టీ) అవకాశాన్ని అక్కడి తెలంగాణ వాసులు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధులు బృందాన్ని పంపింది.

కొన్ని రోజుల క్రితం యూఏఈ లో ఇబ్బంది పడుతున్న తెలుగు రాష్ట్రాల కార్మికులు అని వచ్చిన కధనానికి స్పందించిన తెలంగాణా ప్రభుత్వం వారి పౌరుల కోసం వారిని సురక్షితంగా తెలంగాణా తీసుకువెళ్ళడం కోసం యూఏఈ కి ఒక కమిటీ తో కూడిన బృందంతో పయనం అయ్యింది.సాధారణ పరిపాలన శాఖ సంయుక్త కార్యదర్శి అరవింద్‌ సింగ్‌, హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి విష్ణువర్ధన్‌ రెడ్డితో పాటు కొంతమంది అధికారులు అక్కడికి చేరుకున్నారు.

అయితే ఈ బృందం అక్కడ భారతీయ రాయబార కార్యాలయం ప్రతినిధులతో పాటు దుబాయ్‌ దౌత్యాధికారితో సమావేశమైన అనంతరం దుబాయ్‌, షార్జా తదితర ప్రాంతాల్లో బృందం పర్యటించి అక్కడి కార్మిక క్యాంపులను సందర్శించనుంది.తెలంగాణ వాసుల ఇబ్బందులను తెలుసుకుని స్వరాష్ట్రానికి వచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది.అలాగే గల్ఫ్‌ వెళ్లి అక్కడ కూలీగా పనిచేస్తూ గాయపడ్డ కొమురయ్యను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ట్రంప్‌ కోసం వైట్‌హౌస్ ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తుందంటే?
Advertisement
Advertisement

తాజా వార్తలు