అతిథులుగా ఇద్దరు సీఎంలు?

భారీ అంచనాల నడుమ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘రుద్రమదేవి’.

ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ముగించుకుని, విడుదలకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.

ఇక ఈ సినిమా ఆడియోను భారీ ఎత్తున విడుదల చేసేందుకు గుణశేఖర్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.కాకతీయ వీర నారి రుద్రమదేవి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియోను కాకతీయుల కోట వరంగల్‌ పోర్ట్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఆడియో వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా ఆహ్వానించాలని గుణశేఖర్‌ భావిస్తున్నాడు.ఇప్పటికే ఈ ఇద్దరు మఖ్యమంత్రుల అపాయింట్‌మెంట్‌ను గుణశేఖర్‌ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా ఆడియోను 22న వరంగల్‌లో విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే దర్శకుడు గుణశేఖర్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.విశాఖలో ఈ సినిమా ఆడియోను విడుదల చేయాలనే ఆలోచనలో కూడా గుఖశేఖర్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

ఈనెల 21న విశాఖలో ఆడియో విడుదల చేసే అవకాశాలున్నాయి.అనుష్క ‘రుద్రమదేవి’గా నటించిన ఈ సినిమాలో గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ నటించిన విషయం తెల్సిందే.

ఈ సినిమాను వచ్చే నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు