ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు మెగా మాస్ డైరెక్టర్స్.. పిక్చర్ అదిరిందిగా!

మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.

ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో దసరా పండుగకు వచ్చిన మెగాస్టార్ ఇప్పుడు సంక్రాంతి పండుగకు వాల్తేరు వీరయ్య సినిమాలో వస్తున్నాడు.

చిరంజీవి మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా వాల్తేరు వీరయ్య.ఈ సినిమా కోసం ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు అటు మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ రోజు జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.రిలీజ్ కు ముందే భారీ అంచనాలను సెట్ చేసుకున్న వాల్తేరు వీరయ్య ఇక రిలీజ్ తర్వాత మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

చిరు అయితే కాస్త కూడా రెస్ట్ లేకుండా వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యేలా చేయడంలో సఫలం అయ్యాడు.

Advertisement

ఇక ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను డైరెక్ట్ చేసిన యంగ్ డైరెక్టర్ ను మరో మెగా డైరెక్టర్ మెహర్ రమేష్ ప్రత్యేకంగా కలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.

ఈ రోజు వాల్తేరు వీరయ్య రిలీజ్ అవుతున్న నేపథ్యంలో యంగ్ డైరెక్టర్ మెహర్ రమేష్ బాబీని కలిశారు.

ఈ సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో అభినందనలు తెలియజేస్తూ దిగిన పిక్ నెట్టింట వైరల్ గా మారిపోయింది.మెగాస్టార్ నటించిన భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.భోళా శంకర్ సినిమా ఇప్పటికే షూట్ స్టార్ట్ అయ్యి కొద్దీ భాగం షూట్ కూడా పూర్తి అయ్యింది.

ఇక ఈ సినిమాలో చిరుకి జోడిగా తమన్నా భాటియా నటిస్తుండగా.ఆయన సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది.మరి ఈ ఇద్దరు మెగాస్టార్ డైరెక్టర్లు కలిసి దిగిన ఈ సూపర్ పిక్ నెట్టింట అలరిస్తుంది.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు