సింగపూర్ : లంచం కేసు.. ఇద్దరు భారతీయ ఉద్యోగులకు భారీ జరిమానా

లంచం తీసుకున్న కేసులో ఇద్దరు భారతీయ ఉద్యోగులకు సింగపూర్ కోర్ట్‌ ఒక్కొక్కరికి 24 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.

నిందితులను మహేశ్వరన్ ఎం రతీనా సవపతి (27), రెనిత మురళీధరన్ (31)లుగా గుర్తించారు.

వీరిద్దరూ ఆహార పంపిణీ సంస్థ సొన్నమెరాలో పనిచేస్తున్నారు.విచారణ సందర్భంగా ఒక్కొక్కరు మూడు అక్రమార్జన ఆరోపణలను అంగీకరించినట్లు స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తాపత్రిక నివేదించింది.2020లో కంపెనీ గోడౌన్ సూపర్‌వైజర్‌గా వున్న రతీనా సవపతి.మాన్‌పవర్ కాంట్రాక్ట్ సేవల సంస్థ ఇన్‌స్పిరోలో డైరెక్టర్‌గా వున్న హేమ సుతన్‌ నాయర్ అచ్యుతన్నాయర్‌ నుంచి 6,800 సింగపూర్ డాలర్ల లంచాన్ని తీసుకున్నాడు.

ఇందుకు బదులుగా సొన్నమెరా సంస్థకు మానవ వనరులను సరఫరా చేయడానికి అచ్యుతన్నాయర్ కంపెనీని సిఫారసు చేయాలనే విషయాన్ని మురళీధరన్‌తో రతీనా సవపతి పంచుకున్నాడు.ప్రాసిక్యూటర్ నివేదిక ప్రకారం.

మురళీధరన్ దీనికి ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు.రతీనాసవపతి 2020లో మొత్తంగా 6,800 సింగపూర్ డాలర్ల లంచాలు అందుకున్నాడు.

Advertisement

ఆ తర్వాత మురళీధరన్‌కు తన వాటా కమీషన్‌ కింద 3,400 సింగపూర్ డాలర్లు ఇచ్చాడు.ఇద్దరిపై అభియోగాలు రుజువు కావడంతో కోర్టు ఒక్కొక్కరికి 24000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.

సింగపూర్‌లో కోవిడ్ 19 సర్క్యూట్ బ్రేకర్ విధించబడటానికి ముందు 2020లో మార్చిలో మలేషియాకు వెళ్లిన అచ్చుతన్నాయర్ ఇప్పటికీ పరారీలోనే వున్నాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జేన్ లిమ్ తెలిపారు.అయితే అవినీతి వ్యవహారాల ఇన్వెస్టిగేషన్ బ్యూరో జనవరి 2021లో ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంది.

కాగా.దొంగతనం కేసులో భారత సంతతికి చెందిన వ్యక్తికి గత నెలలో 42 నెలల జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్ట్.జనవరి 2020లో ఖాళీగా వున్న కాలేజ్ నుంచి కాపర్ వైర్లు, కేబుల్స్ దొంగిలించినందుకు న్యాయస్థానం ఈ శిక్ష విధించింది.

నిందితుడిని ఓం శక్తి తివారీగా గుర్తించారు.ఇతను తన బంగ్లాదేశ్ మిత్రులతో కలిసి ఘటన జరిగిన రోజు రాత్రి ఖాళీగా వున్న కాలేజీలోంచి కిలోల కొద్దీ ఎలక్ట్రిక్ కేబుల్స్‌ను దొంగిలించాడు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

తొలుత 994 కిలోల కేబుల్‌ను రీ సైక్లర్స్‌కు 3,976 సింగపూర్ డాలర్లకు.తర్వాత మరో 773 కిలోల కేబుల్‌ను అదే దుకాణదారుడికి మరో 3,976 సింగపూర్ డాలర్లకు విక్రయించాడు.

Advertisement

తాజా వార్తలు