Geetha singh naresh : హీరోయిన్స్ ఇద్దరూ అవమానించారు.. అల్లరి నరేష్ కాపాడాడు: గీతా సింగ్

తెలుగు సినీ ప్రేక్షకులకు లేడీ కమెడియన్ గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదట ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన ఎవడి గోల వాడిదే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది గీతా సింగ్.

ఆ తర్వాత అల్లరి నరేష్ నటించిన కితకితలు సినిమాతో హీరోయిన్ గా నటించడంతోపాటు భారీ పాపులరీటిని సంపాదించుకుంది గీతా సింగ్.తన నటనతో పేక్షకులను కడప నవ్వించింది.

కితకితలు సినిమాతో గీతా సింగ్ ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకుంది.కితకితలు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న గీతా సింగ్.

ఆ ఆ తర్వాత ప్రేమాభిషేకం, సీమ టపాకాయ్, కెవ్వు కేక, సరైనోడు వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.ఫిమేల్ కమెడియన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గీతా సింగ్.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతా సింగ్ తన జీవితంలో ఎదురైనా పలుచేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

ఓ సందర్భంలో తనను ఇద్దరు హీరోయిన్లు అవమానించారని, ఆ సమయంలో అల్లరి నరేష్ తన పరువు నిలబెట్టారని తెలిపింది.అల్లరి నరేష్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన గీతా సింగ్.

ఆ సినిమా షూటింగ్ లో తనని ఇద్దరు హీరోయిన్లు అవమానించారట.షూటింగ్ జరుగుతుండగా గ్యాప్ సమయంలో గీతా సింగ్ క్యారవాన్ ఎక్కగా అందులో బాంబే హీరోయిన్స్ ఉన్నారట.

అప్పుడు వాళ్ళు ఏంటి ఈమె క్యారవాన్ ఎక్కింది, జూనియర్ ఆర్టిస్ట్ అంటూ అవమానించారట.అప్పుడు మిగతా నటులు ఏంటి సింగ్ వాళ్ళు అలా అంటున్నారు అనగా అప్పుడు గీతా సింగ్ వాళ్లకు తెలియక అలా అంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట.ఆ విషయం తెలుసుకున్న అల్లరి నరేష్ గీత సింగ్ ని పిలుచుకొని బాంబే హీరోయిన్స్ దగ్గరికి వెళ్లి ఈమె నా ఫస్ట్ హీరోయిన్.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

తన నుంచి నాకు బ్రేక్ వచ్చింది అని చెప్పడంతో ఆ హీరోయిన్లు కంగుతిని ఆ తర్వాత నుంచి గీతా సింగ్ ని మేడమ్ అని పిలవడం ప్రారంభించారట.అలా అల్లరి నరేష్ తన పరువును నిలబెట్టారు అని చెప్పుకొచ్చింది గీతా సింగ్.

Advertisement