దుబాయ్‌లో దారుణం .. ఇద్దరు తెలుగువారిని నరికి చంపిన పాకిస్తానీ

దుబాయ్‌లో( Dubai ) దారుణం జరిగింది.

తెలంగాణకు చెందిన ఇద్దరు కార్మికులను పాకిస్తాన్‌కు( Pakistan ) చెందిన వ్యక్తి హత్య చేశాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్( Bandi Sanjay Kumar ) తెలిపారు.

మృతులను నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్,( Ashtapu Prem Sagar ) నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌గా( Srinivas ) గుర్తించారు.ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది.

బాధితులు కూడా తెలుగువారేనని సమాచారం.వీరంతా దుబాయ్‌లోని మోడ్రన్ బేకరీలో( Modern Bakery ) పనిచేస్తున్నారు.

ఇక్కడ పనిచేసే వారంతా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే.

Advertisement

మృతుడు ప్రేమ్ సాగర్‌కు భార్య , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.కొద్దిరోజుల క్రితం అతని నాయనమ్మ మరణించగా.అతని బావ ప్రమాదానికి గురై ప్రస్తుతం నిజామాబాద్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

ఒకే కుటుంబంలో వరుస సంఘటనలు జరగడం తీవ్ర విషాదాల జరగడంతో ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ప్రేమ్ సాగర్ సోదరుడు అష్టపు సందీప్‌తో తాను మాట్లాడానని .ఆయన భౌతికకాయం భారతదేశానికి తిరిగి రావడానికి అండగా నిలుస్తాని బండి సంజయ్ తెలిపారు.ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత కాన్సులేట్ ద్వారా దుబాయ్ పోలీసులను మంత్రి వెల్లడించారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ వేగంగా స్పందించి.ఈ విషయాన్ని అత్యవసరంగా ముందుకు తీసుకెళ్లినందుకు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.బాధితులను త్వరగా స్వదేశానికి రప్పించడానికి అవసరమైన అన్ని సహాయాలను తాము అందిస్తున్నామని.

దు:ఖ సమయంలో వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని మంత్రి చెప్పారు.కేంద్ర బొగ్గు , గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

తెలంగాణకు చెందిన ఇద్దరు తెలుగువారి హత్య తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు.విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌తో తాను మాట్లాడానని.

Advertisement

మృతుల కుటుంబాలకు పూర్తి మద్ధతు ఇస్తామని, మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పిస్తామని హామీ ఇచ్చారు.పని ప్రదేశంలో ఒత్తిడితో పాటు మతపరమైన ఉద్రిక్తతల కారణంగా ఈ దాడి జరిగిందని ఆరోపించారు.

తాజా వార్తలు