ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.25వ తేదీ ఉదయం 4 గంటల నుంచే దేశంలోని పలు థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శితం కానుంది.
చరణ్, తారక్ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సినిమాతో దక్కుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మూడు గంటల రెండు నిమిషాల నిడివితో ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది.అయితే ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నిడివి తెలుగు వెర్షన్ కంటే ఎక్కువ కావడం గమనార్హం.
మూడు గంటల 7 నిమిషాల నిడివితో ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది.వైరల్ అవుతున్న ఈ వార్త వల్ల ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ లో లేని సన్నివేశాలు హిందీ వెర్షన్ లో ఉండవచ్చని చరణ్, తారక్ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
చిత్రయూనిట్ నుంచి ఎవరో ఒకరు క్లారిటీ ఇచ్చి ఈ సందేహాలకు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.తెలుగు వెర్షన్ లో లేని సీన్లు హిందీలో ఉంటే మాత్రం ఫ్యాన్స్ ఫీలయ్యే ఛాన్స్ ఉంది.
తెలుగు రాష్ట్రాల వరకు ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందనడంలో సందేహం లేదు.అయితే ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో హిందీ వెర్షన్ కలెక్షన్లు కూడా ఈ సినిమాకు కీలకం కానుంది.కట్టప్ప ఫ్యాక్టర్ బాహుబలి2 హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడానికి కారణం కాగా ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత హిందీలో భారీగా కలెక్షన్లు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీలో మొదట చరణ్ ఎంట్రీ ఉంటుందని ఆ తర్వాత తారక్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.ఈ సినిమా ద్వారా చరణ్, ఎన్టీఆర్, జక్కన్నలకు ప్రేక్షకుల అంచనాలకు అందని స్థాయిలో రెమ్యునరేషన్ దక్కిందని ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy