ఆ రెండు రోజులు సెలవు దినాలు… కలెక్టర్లకు నిమ్మగడ్డ ఆదేశాలు..!!

రాష్ట్ర పంచాయతీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 10,14 తారీకులు సెలవు దినంగా ప్రకటించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా 12 నగర పాలికలు అదేవిధంగా 75 పురపాలికల్లో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో.సెలవులు ప్రకటించాలని సూచించారు.

Nimmagadda Ramesh Kumar,panchayathi Elections,muncipal Elections,sec, Nimmagadda

ఇటీవల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో.మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

పోలింగ్ జరిగే రోజు అదేవిధంగా కౌంటింగ్ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇవ్వాలని కోరారు.ఎన్నికల రోజు అనగా మార్చి 10వ తారీఖు అదే రీతిలో కౌంటింగ్ తేదీ అనగా మార్చి 14వ తారీఖున ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement

ఎక్కడా కూడా ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై పోలీస్ శాఖ దృష్టి పెట్టాలని తెలిపారు.ఇదే రీతిలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు