కేటీఆర్ వ్యాఖ్య‌ల‌తో ట్విట్ట‌ర్ వార్.. కేంద్రంపై ఫైర్ కి బ‌దులుగా నెటిజన్ల కౌంటర్

మంత్రి కేటిఆర్ కేంద్రంపై చేసిన వ్యాఖ్య‌ల‌తో ట్విట్ట‌ర్ వార్ జ‌రుగుతోంది.

చేనేత ఖాదీ వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ విధించ‌డంపై నిప్పులు చెరుగుతూ కేటిఆర్ చేసిన ట్విట్ కు నెటిజ‌న్లు కౌంట‌ర్లు వేస్తున్నారు.

కేంద్రం జీఎస్టీ ఓకే.మ‌రి స్టేట్ జీఎస్టీ మాటేమిటి.? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.మంత్రి కేటిఆర్ ఎమ్మ‌న్నాడంటే.

స్వదేశీ నినాదం అంటే చేనేత ఖాదీ వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ విధించడమా.? అని ప్రధాని మోడీ సెటైర్లు వేశారు.అయితే కేటీఆర్ ట్వీట్ కు నెటిజన్ల నుంచి కూడా ఘాటు కౌంటర్లు ప‌డుతున్నాయి.

ఇటు కేటీఆర్ ట్వీట్.అటు నెటిజన్ల కౌంటర్లతో సోషల్ మీడియాలో ర‌చ్చ అవుతోంది.

Advertisement
Twitter War With KTR S Comments Instead Of Fire On The Center , Netizens Count

మంత్రి కేటీఆర్ తాజాగా చేనేత ఖాదీపై జీఎస్టీ విధింపునకు నిరసనగా ట్వీట్ చేస్తూ నాడు మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి ఆత్మనిర్భర్ చిహ్నంగా చరఖా ఉపయోగిస్తే.ఇప్పుడు చేనేత ఖాదీ వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధానిగా నిలిచారు.

ఇదేనా మీరు సాధించిన ఆత్మనిర్భర్ భారత్.? కేంద్ర ప్రభుత్వం జాతికి తెలియజెప్పే స్వదేశీ నినాదం ఇదేనా.? అని కేటీఆర్ ప్రశ్నించారు.గత ఎనిమిదేళ్లలో చేనేత కార్మికుల కోసం కేంద్రం ఏం చేసిందో ఎందుకు చెప్ప‌రని అడిగారు.

Twitter War With Ktr S Comments Instead Of Fire On The Center , Netizens Count

ఎంపీ బండి సంజ‌య్ ఏం చేశారు.అలాగే ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కానుకగా ప్రకటించిన నేతన్న బీమా పథకంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలకు కూడా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.గత ఎనిమిదేళ్లలో చేనేత కార్మికుల కోసం కేంద్రం ఏం చేసిందో ఎందుకు చెప్పరని కేటీఆర్ ప్రశ్నించారు.

కనీసం తన సొంత నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ కూడా మంజూరు చేయించలేని ఓ నిస్సహాయ ఎంపీగా బండి సంజయ్ ను కేటీఆర్ అభివర్ణించారు.

Twitter War With Ktr S Comments Instead Of Fire On The Center , Netizens Count
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

అయితే కేటీఆర్ ట్వీట్ కు నెటిజన్లు ఫైర్ అవుతూ రివ‌ర్స్ కౌంటర్లు వేస్తున్నారు.చేనేత ఖాదీ ఉత్పత్తులపై జీఎస్టీ విధింపుల్లో రాష్ట్రాల మద్దతు లేనిదే సాధ్యం కాదు.అంటూ కేటీఆర్ పై మండిపడుతున్నారు.

Advertisement

డబుల్ గేమ్ ఆడొద్ద‌ని.మ‌రి రాష్ట్రాల పన్నుల సంగ‌తి ఏంట‌ని.

వివిధ రంగాలపై టీఆర్ఎస్ వేసిన పన్నులను చెప్తూ ప్ర‌శ్న‌లు సంధించారు.కేటీఆర్ ఒక్క ట్వీట్ తో ర‌చ్చ మొద‌లైంది.

తాజా వార్తలు