మైరాన్ మోహిత్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్

డ్రగ్స్ పెడ్లర్ మోహిత్ కేసులో ట్విస్ట్ బయటకు వచ్చింది.

సినీ నటి, హీరోయిన్ నేహా దేశ్ పాండే ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు హైదరాబాద్ నార్కోటిక్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశారని సమాచారం.కాగా నేహా దేశ్ పాండే పెడ్లర్ మైరాన్ మోహిత్ భార్య అని అధికారులు తెలిపారు.

పబ్ లో సప్లైయిర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన మోహిత్ ఇంటర్నేషన్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే స్థాయికి చేరుకున్నాడు.డ్రగ్స్ దందాలో మెహిత్ ఎడ్వీన్ కు నమ్మినబంటుగా తెలుస్తోంది.

నేహా దేశ్ పాండే డ్రగ్స్ సరఫరా చేసిన వారిలో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లు సమాచారం.అయితే వారు ఎవరనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

Advertisement
రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?

తాజా వార్తలు