సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి.. ఫోటోలు బయటకు రావడంతో అందరూ షాక్?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి దేవలీనా భట్టాచార్జి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

దేవలీనా భట్టాచార్జి అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ కోడలా కోడలా కొడుకు పెళ్ళామా సీరియల్ హీరోయిన్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.

ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది దేవలీనా భట్టాచార్జి.ఇదిలా ఉంటే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే తాజాగా ఈమె సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది.తన ప్రియుడుతో మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.

తాజాగా లోనావాలాలో జరిగిన దేవలీనా భట్టాచార్జి వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.వీరిలో దేవలీనా స్నేహితులు విశాల్‌ సింగ్‌, రష్మీ సింగ్‌, భావిని పురోహిత్‌ దంపతులు ఉన్నారు.ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోస్,వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలోనే ట్విటర్‌లో దేవలీనాకీ షాదీ #DevoleenaKiShaadi అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌గా మారింది.అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలలో ఎక్కువగా విశాల్‌ సింగ్‌ వధువు పక్కన ఉండటంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని చాలామంది పొరపడుతున్నారు.

కానీ అది నిజం కాదు.విశాల్ స్నేహితుడు మాత్రమే.ఇది ఈ పోటోలను చూసిన కొందరు నెటిజన్స్ ఇది నిజమైన పెళ్లి లేకపోతే ఏదైనా మ్యూజిక్‌ ఆల్బమ్‌ కోసం ఇలా రెడీ అయ్యావా? అని అడుగుతున్నారు.అటు దేవలీనా సైతం హల్ది, మెహందీ, పెళ్లి ఫోటోలు పెట్టిందే తప్ప వరుడి ముఖాన్ని చూపించలేదు.

ఫొటోస్ కూడా షేర్ చేయలేదు.ఒక్క ఫోటోలో మాత్రం భర్త చేయిని పట్టుకుని ఉంది.

అయితే నటి జిమ్‌ ట్రైనర్‌ షాన్వద్‌ షైఖ్‌ను పెళ్లాడినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ సస్పెన్స్‌కు చెక్‌ పెడుతూ ఎట్టకేలకు తను పెళ్లాడింది ఎవరినో ప్రకటించింది దేవలీనా.

మన చేతి రేఖలలో మార్పులు జరుగుతాయా... ఈ మార్పు దేనికి సంకేతం?

ఆ మిస్టరీ మ్యాన్‌ మరెవరో కాదు ఫేమస్‌ జిమ్‌ ట్రైనర్‌ షోనూనే అని వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు అప్‌లోడ్‌ చేసింది.

Advertisement