ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన టన్నెల్.. చిక్కుకున్న కార్మికులు

ఉత్తరాఖండ్ లో పెను ప్రమాదం సంభవించింది.ఉత్తర కాశీలోని యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న టన్నెల్ కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో సుమారు 35 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలుస్తోంది.దాదాపు ఎనిమిది వందల మీటర్ల అడుగులో కార్మికులు చిక్కుకున్నారు.

సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.ఇందులో భాగంగానే సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు.

అయితే చార్ దామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా సిల్క్ యారా నుంచి దండల్ గాన్ ను కలుపుతూ నాలుగు కిలోమీటర్ల టన్నెల్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...