TSRTCలో ఇకనుండి రేడియో వినబడనుంది… ముందుగా ఈ 9 సిటీ బస్సుల్లోనే!

TSRTC కొత్త పుంతలు తొక్కుతోంది.ప్ర‌యాణికులకు మరింతగా చేరువ అయ్యేందుకు కొత్త కొత్త ఎత్తుగడలతో ముందుకు పోతోంది.

అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా ఉండేందుకు బస్సుల్లో ‘TSRTC రేడియో’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత.

ఫైలట్‌ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ సిటీలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకు వచ్చింది.హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో కూకట్‌పల్లి డిపో బస్సులో ఈ రేడియోను TSRTC MD అయినటువంటి VC సజ్జనర్ ప్రారంభించారు.

అనంతరం రేడియో పనితీరును కూడా ఆయన దగ్గరుండి పరిశీలించారు.ఫైలట్‌ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన TSRTC రేడియో ప్ర‌యాణీకుల‌ను అల‌రించ‌నుంద‌ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఈ సందర్భంగా తెలిపారు.దిల్‌సుఖ్‌నగర్ – సికింద్రాబాద్‌, ఉప్పల్ – సికింద్రాబాద్‌, గచ్చిబౌలి – మెహిదిపట్నం, కూకట్‌పల్లి – శంకర్‌పల్లి, సికింద్రాబాద్ – పటాన్‌చెరువు, కొండాపూర్ – సికింద్రాబాద్‌, కోఠి – పటాన్‌చెరువు, ఇబ్రహింపట్నం – జేబీఎస్‌ మార్గాల్లో న‌డిచే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని ఈ నేపథ్యంలో తెలిపారు.

Advertisement

వీటిద్వారా ప్రయాణికులకు వినోదం అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని TSRTC కంకణం కట్టుకుంది.ఈ రేడియో ద్వారా మహిళ, పిల్లల భద్రత, సైబర్‌, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు.ప్రయాణికుల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత.

పూర్తిస్థాయిలో అన్ని బస్సుల్లోనూ ఈ రేడియోను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం తెలిపింది.ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణకు 9 బస్సుల్లో క్యూఆర్ కోడ్‌ల‌ను ఏర్పాటు చేశామని వివరించారు.

ఆ క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌లో స్కాన్‌ చేసి.రేడియోపై ఫీడ్‌బ్యాక్ ను ప్రయాణికులు ఇవ్వాలని సూచించారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు