టీఎస్ఆర్టీసీ ఇకపై టీజీఎస్ఆర్టీసీగా మార్పు.. టీజీ సిరీస్ తో రిజిస్ట్రేషన్లు

టీఎస్ ఆర్టీసీ ఇకపై టీజీఎస్ ఆర్టీసీగా( TGSRTC ) మారనుంది.ఈ మేరకు త్వరలోనే లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారని తెలుస్తోంది.

దీంతో బస్సులు టీజీ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం( Telangana State ) ఏర్పాటైన తరువాత అప్పటి ప్రభుత్వం టీఎస్ ఆర్టీసీగా( TSRTC ) పేరు మార్చిన సంగతి తెలిసిందే.

అయితే ఉద్యమ సమయంలో టీజీని తెలంగాణ వాదులతో పాటు ప్రజలు కూడా ఉపయోగించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్( Congress ) తాము అధికారంలోకి వచ్చిన తరువాత టీఎస్ ను టీజీగా మార్చుతామని ప్రకటించింది.

ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ టీజీ అమలుకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో టీఎస్ కు బదులు టీజీని ఉపయోగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
ఏపీకి అమరావతి రాజధాని మాత్రమే కాదు అంటూ చంద్రబాబు సంచలన పోస్ట్..!!

తాజా వార్తలు