మదర్స్ డే నాడు టి.ఎస్.ఆర్టీసీ బంపర్ ఆఫర్..!

మదర్స్ డే సందర్భంగ టీ.ఎస్ ఆర్టీసీ సూపర్ ఆఫర్ ఎనౌన్స్ చేసింది.

మే 8న మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించారు. 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలతో వస్తే వారికి ఎలాంటి ఆర్టీసీ బస్సుల్లో అయినా ఉచిత ప్రయాణం ఉంటుందని ఇది కేవలం మదర్స్ డే రోజు మాత్రమే అని ఆర్టీసీ సంస్థ తెలిపింది.

మదర్స్ డే నాడు ఏసీ బస్సులతో సహా అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులంతా కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు.టీ.

ఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, టీ.ఎస్ ఆర్టీసీ చైర్మన్ జాజి రెడ్డి ఈ సందర్భంగా మాతృ మూర్తులందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.మదర్స్ డే అన్నది చాలా గొప్ప రోజు అని.మనందరినీ ఈ భూమి మీదకు తెచ్చిన తల్లులని ఎంతో గౌరవంగా చూసుకోవాలని వారు అన్నారు.ఇప్పటికే టి.ఎస్ ఆర్టీసీ ప్రతి ఒక్క పండుగకి పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ప్రజలని ఆకర్షిస్తుంది.ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ వచ్చినప్పటి నుండి సంస్థలో కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown