టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు: ఇవాళ మరోసారి నిందితుల విచారణ

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దూకుడు పెంచింది.విచారణలో భాగంగా ప్రధాన నిందితులను ఈడీ అధికారులు ఇవాళ మరోసారి విచారించనున్నారు.

కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ లను నిన్న చంచల్ గూడ్ జైలులో దాదాపు 5 గంటల పాటు అధికారులు విచారించారు.అయితే ప్రశ్నాపత్రాల లీకేజ్ వెనుక నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఏ మేరకు నిధులు చేతులు మారాయనే దానిపై ఆరా తీస్తోంది.

గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు