రోహింగ్యాల నిర్బంధ ఉత్త‌ర్వులు కొట్టేసిన టీఎస్ హైకోర్టు

రోహింగ్యాల నిర్బంధ ఉత్త‌ర్వులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.హైద‌రాబాద్ లో రోహింగ్యాల నిర్బంధాన్ని న్యాయ‌స్థానం త‌ప్ప‌బ‌ట్టింది.

అనుమ‌తి లేకుండా హైద‌రాబాద్ లో ఉన్న రోహింగ్యాల‌ను గ‌త ఏడాది జైలుకు త‌ర‌లించిన విష‌యం తెలిసిందే.ఈ క్ర‌మంలో పోలీసుల నిర్ణ‌యాన్ని రోహింగ్యాలు హైకోర్టులో స‌వాల్ చేశారు.

రోహింగ్యాల పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం.వారిని చ‌ర్ల‌ప‌ల్లి జైలులో నిర్బంధించ‌డం చ‌ట్ట విరుద్ధ‌మ‌ని తెలిపింది.

రోహింగ్యాల‌ను జైలుకు త‌ర‌లించే అధికారం కేవ‌లం కేంద్రానికి మాత్ర‌మే ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.అనంత‌రం రోహింగ్యాల నిర్బంధ ఉత్త‌ర్వుల‌ను కొట్టివేసింది.

Advertisement
Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!

తాజా వార్తలు