నేడు హైదరాబాద్ కు టీఎస్ కాంగ్రెస్ అడ్వైజర్ దిగ్విజయ్ సింగ్..!

తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని చక్కదిద్దే బాధ్యతలు తీసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ అడ్వైజర్ దిగ్విజయ్ సింగ్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు.

ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆయన దృష్టి సారించారు.

పార్టీ హైకమాండ్ ఆదేశాలతో సమస్య పరిష్కారానికి డిగ్గీరాజా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో రేపు కాంగ్రెస్ అసమ్మతి నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

అనంతరం తిరిగి రేపు సాయంత్రం ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement