చుండ్రును శాశ్వ‌తంగా వ‌దిలించుకోవాలా? అయితే ఇలా చేయండి!

చుండ్రు.స్త్రీల‌నే కాదు పురుషుల‌ను తీవ్రంగా స‌త‌మ‌తం చేసే స‌మ‌స్య ఇది.

ఫంగల్ ఇన్ ఫెక్షన్, వాతావరణంలో వ‌చ్చే మార్పులు, తల్లోని నూనె గ్రంథులు స్రవించడం తగ్గిపోవడం, కెమిక్స‌ల్ ఎక్కువ‌గా ఉండే షాంపూల‌ను వాడ‌టం, షాంపూ చేసుకున్న‌ప్పుడు జుట్టును స‌రిగ్గా వాష్ చేయ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య ఏర్పడుతుంది.

దాంతో వివిధ స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

పైగా దుస్తులపై తెల్లటి పొట్టులా చుండ్రు రాలుతుంటే ఎంతో బాధ‌క‌రంగా ఉంటుంది.ఇలా మీకు జ‌రుగుతుందా.? మీరు చుండ్రును శాశ్వ‌తంగా వ‌దిలించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారా.? అయితే వెంట‌నే ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని ప్ర‌య‌త్నించండి.మొద‌ట మీరు చేయాల్సిన ప‌ని ఏంటంటే.

ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని తొక్క తొల‌గించి స‌న్న‌గా తురుముకోవాలి.ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక క‌ప్పు ఆలివ్ ఆయిల్ మ‌రియు ఉల్లిపాయ తురుము వేసుకుని స్లో ఫ్లేమ్‌పై ప‌ది నిమిషాల పాటు ఉడికించి చ‌ల్లార‌బెట్టుకోవాలి.

Advertisement

పూర్తిగా కూల్ అయిన వెంట‌నే స్ట్రైన‌ర్ సాయంతో నూనెను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఆయిల్ లో వ‌న్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడ‌ర్, వ‌న్ టేబుల్ స్పూన్ ఎండిన వేపాకుల పౌడ‌ర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని త‌ల మొత్తానికి ప‌ట్టించి.ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

రెండు గంట‌ల అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.

వారానికి ఒక్క సారి ఇలా చేస్తే చుండ్రు స‌మ‌స్య‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెప్పొచ్చు.అలాగే ఈ రెమెడీ వ‌ల్ల‌ హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది.జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగ‌డం ప్రారంభం అవుతుంది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

మ‌రియు పొడిబారిన జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా కూడా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు