పుచ్చ‌కాయ వేస‌వి తాపాన్ని తీర్చ‌డమే కాదు జుట్టు రాల‌డాన్ని కూడా అరిక‌డుతుంది.. తెలుసా?

ప్రస్తుత వేసవి కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయ ఒక‌టి.

వేసవి తాపాన్ని తీర్చడానికి పుచ్చకాయ ఎంతో బాగా సహాయపడుతుంది.

అలాగే డీహైడ్రేషన్, హిట్ స్ట్రోక్( Watermelon ) Dehydration ) వంటి సమస్యలకు పుచ్చకాయ సమర్థవంతంగా అడ్డుకట్ట వేస్తుంది.అందుకే వేసవికాలంలో నిత్యం పుచ్చకాయను తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే పుచ్చకాయ వేసవి తాపాన్ని తీర్చడమే కాదు జుట్టు రాలడాన్ని కూడా అరికట్టగలదు.మరి అందుకోసం పుచ్చకాయ ని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Try This Watermelon Hair Mask To Stop Hair Fall Stop Hair Fall, Hair Fall, Wate

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పుచ్చకాయ మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) మరియు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె ( Coconut oil )వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధ‌రించాలి.40 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.

Try This Watermelon Hair Mask To Stop Hair Fall Stop Hair Fall, Hair Fall, Wate
Advertisement
Try This Watermelon Hair Mask To Stop Hair Fall! Stop Hair Fall, Hair Fall, Wate

ఈ పుచ్చ‌కాయ హెయిర్ మాస్క్ వేసుకోవ‌డం వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది.ఇది మీ జుట్టును పటిష్టం చేయడంలో మరియు రాల‌కుండా అడ్డుకోవ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

అలాగే ఈ పుచ్చకాయ మాస్క్ మీ జుట్టును హైడ్రేట్ చేస్తుంది.పొడి మరియు దెబ్బతిన్న జుట్టుకు పోషణ, పునరుజ్జీవనం అందిస్తుంది.

జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.చాలా మంది వేస‌వి కాలంలో డ్రై హెయిర్ తో స‌త‌మ‌తం అవుతుంటారు.

అలాంటి వారికి కూడా ఈ పుచ్చ‌కాయ హెయిర్ మాస్క్ ఎంతో హెల్ప్ ఫుల్‌గా ఉంటుంది.ఈ మాస్క్ మీ జుట్టు కోల్పోయిన తేమ మరియు మృదుత్వాన్ని పునరుద్ధరించడానికి స‌హాయ‌ప‌డుతుంది.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

వారానికి రెండు సార్లు ఈ హెయిర్ మాస్క్‌ వేసుకోవ‌డం వ‌ల్ల ఫ్రిజ్ త‌గ్గుతుంది.మెరిసే జుట్టును పొందుతారు.

Advertisement

తాజా వార్తలు