మందారం చేసే మ్యాజిక్.. ఇలా వాడాలంటే మీ ముఖం తెల్లగా మెరిసిపోవాల్సిందే!

దాదాపు ప్రతి ఒక్కరి ఇంటి వద్ద మందారం ( Hibiscus )చెట్టు ఉంటుంది.మందార పువ్వులను ప్రధానంగా పూజకు ఉపయోగిస్తారు.

అలాగే కొందరు జుట్టు ఆరోగ్యం కోసం వాడుతుంటారు.అయితే అలంకరణ, కేశ సంరక్షణకే కాదు చర్మానికి కూడా మందారంతో మెరుగులు దిద్దవచ్చు.

స్కిన్ విషయంలో మందారం చేసే మ్యాజిక్ ను చూస్తే మీరే ఆశ్చ‌ర్య‌పోతారు.ముఖ్యంగా మందార పువ్వులను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడారంటే మీ ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోవడం ఖాయం.

అందుకోసం ముందుగా కొన్ని మందారం పువ్వులను సేకరించి ఎండబెట్టుకోవాలి.పూర్తిగా ఎండిన తర్వాత వాటిని మెత్తగా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ మందారం పొడి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది.

Advertisement

ఈ పొడిని ఎలా వాడాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.ఒక బౌల్‌ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మందారం పొడిని వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్‌ పౌడర్,( Orange peel powder ) వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Honey ) మరియు రెండు స్పూన్లు పెరుగు వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ హోమ్ రెమెడీని పాటిస్తే చర్మానికి చక్కని పోషణ అందుతుంది.

స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం తేమగా మారుతుంది.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఆ పదవుల విషయంలో పోటా పోటీ .. బాబుని పవన్ ఒప్పిస్తారా ? 

కాంతివంతంగా మెరుస్తుంది.పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.

Advertisement

మరియు ముడతలు, చర్మం సాగటం, సన్నని గీతలు వంటి వృద్ధాప్య ఛాయలు సైతం ద్వారా ద‌రిచేరకుండా ఉంటాయి.కాబట్టి తెల్లటి మెరిసే అందమైన ముఖ చర్మాన్ని కోరుకునేవారు మందారం తో ఈ సింపుల్ మాస్క్ ను అస్సలు మిస్ అవ్వకండి.

తాజా వార్తలు