అందాన్ని పెంచే చందనం.. వారానికి రెండు సార్లు ఇలా వాడారంటే అద్భుత లాభాలు మీ సొంతం!

ముఖ చర్మం అందంగా తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ఇందులో భాగంగానే రకరకాల స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడుతుంటారు.

వీటి కోసం ప్రతి నెలా వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.అయితే మార్కెట్ లో లభించే చర్మం ఉత్పత్తుల్లో ఎన్నో రసాయనాలు ఉంటాయి.

అవి చర్మ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.అందుకే సహజ పద్ధతిలో అందాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి.

అయితే అందుకు చందనం( Sandalwood Powder ) చాలా అద్భుతంగా సహాయపడుతుంది.వారానికి రెండు సార్లు చందనం పొడిని ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడారంటే అద్భుత లాభాలు మీ సొంతం అవుతాయి.

Advertisement

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani Mitti ) వేసుకోవాలి.అలాగే రెండు చుక్కలు ఆముదం, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloevera Gel ), నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.ముఖ్యంగా చందనం పొడి, ముల్తానీ మట్టి, బీట్ రూట్ పౌడర్( Beetroot Powder ) స్కిన్ టోన్ ను ఇంప్రూవ్ చేస్తాయి.

చర్మంపై ఎటువంటి మచ్చలు ఉన్నా సరే వాటిని క్రమంగా మాయం చేస్తాయి.అలాగే ఈ రెమెడీని పాటించ‌డం వ‌ల్ల సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది.ముడతల‌ను దూరం చేస్తుంది.

భగ్గుమంటోన్న బ్రిటన్.. అప్రమత్తంగా ఉండండి : భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

అంతేకాదు ఈ రెమెడీ ని ఫాలో అవ్వడం వల్ల చర్మం సహజంగానే కాంతివంతంగా మెరుస్తుంది.అందంగా తయారవుతుంది.

Advertisement

కాబట్టి బ్యూటిఫుల్ గ్లోయింగ్ వైట్ స్కిన్ కోసం తపన పడే వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

తాజా వార్తలు