కురుల బలహీనతను పోగొట్టే న్యాచురల్ హెయిర్ మాస్క్.. వారానికి ఒక్కసారి ప్రయత్నిస్తే మరిన్ని బెనిఫిట్స్!!

పోషకాల కొరత, ఒత్తిడి, కాలుష్యం, వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగించడం, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను వాడటం తదితర కారణాల వల్ల ఒక్కోసారి జుట్టు బలహీనంగా మారుతుంటుంది.

ఫలితంగా హెయిర్ ఫాల్,( Hair Fall ) హెయిర్ బ్రేకేజ్ వంటివి అధికంగా ఇబ్బంది పెడుతుంటాయి.

వీటికి చెక్ పెట్టి కురుల బలహీనతను పోగొట్టడానికి న్యాచురల్ హెయిర్ మాస్క్ ఒకటి ఉంది.ఈ హెయిర్ మాస్క్ ను వారానికి ఒకసారి ప్రయత్నిస్తే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకు( Aloevera Leaf ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.

అలాగే ఒక కప్పు బియ్యం వండిన తర్వాత వచ్చే గంజిని( Rice Water ) పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను స‌పరేట్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ సింపుల్ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల చాలా లాభాలను పొందుతారు.

ముఖ్యంగా కలబంద, ఆముదం మరియు అన్నం గంజి లో ఉండే పోషకాలు బలహీనంగా మారిన కురులను దృఢంగా మారుస్తాయి.హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ సమస్యలకు అడ్డుకట్ట వేస్తాయి.అలాగే పొడి జుట్టును రిపేర్ చేస్తాయి.

కురులు స్మూత్ గా సిల్కీగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.అంతేకాదు ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

ఒత్తుగా సైతం పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు