పింక్ అండ్ సాఫ్ట్ లిప్స్ కోసం ఆరాటపడుతున్నారా.. అయితే ఇలా చేయండి!

సాధారణంగా చాలా మంది అమ్మాయిలు పింక్ అండ్ సాఫ్ట్ లిప్స్( Pink and soft lips ) కోసం తెగ ఆరాటపడుతూ ఉంటారు.

అటువంటి పెదాలను పొందేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు.

మార్కెట్ లో ల‌భ్య‌మ‌య్యే ఖరీదైన లిప్ కేర్ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు.అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటే అస్సలు వర్రీ అవ్వకండి.

ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ లిప్ బామ్ ను కనుక వాడితే సహజంగానే గులాబీ రంగులో మెరిసేటి మృదువైన పెదాలు మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు( rose petals ) వేసుకోవాలి.అలాగే పావు కప్పు వాటర్ వేసుకుని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో రోజ్ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Advertisement

గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ తేనె( honey ), వ‌న్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్ ( Vaseline )వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన న్యాచురల్ లిప్ బామ్ అనేది రెడీ అవుతుంది.

రోజు నైట్ నిద్రించే ముందు ఈ లిప్ బామ్ ను పెదాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ హోం మేడ్ లిప్ బామ్ ను కనుక వాడారంటే మీరు ఆశ్చ‌ర్య‌పోయే రిజ‌ల్డ్‌ మీ సొంత అవుతుంది.ముఖ్యంగా ఈ లిప్ బామ్ మీ పెదాలకు చక్కని హైడ్రేషన్ అందిస్తుంది.

నలుపును వదిలించి పెదాలను పింక్ కలర్ లోకి మారుస్తుంది.అలాగే పెదాలు మృదువుగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.

ఫైనల్ గా ఈ లిప్ బామ్ తో సహజంగానే పింక్ అండ్ సాఫ్ట్ లిప్స్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు