డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ ను అరికట్టే బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ సీరం మీకోసం!

డెలివరీ అనంతరం మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో హెయిర్ ఫాల్ అనేది ముందు వరుసలో ఉంటుంది.అందరిలోనూ హెయిర్ ఫాల్ ఉండకపోవచ్చు.

కానీ అధిక శాతం మహిళలు ప్రసవం అనంతరం హెయిర్ ఫాల్ తో సతమతం అవుతుంటారు.డెలివరీకి ముందు వరకు ఎంతో ఒత్తుగా ఉన్న‌ జుట్టు ఆ తర్వాత మాత్రం చాలా పల్చగా మారిపోతుంటుంది.

దీంతో హెయిర్ ఫాల్( Hair fall ) సమస్యను ఎలా వదిలించుకోవాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం బెస్ట్ వన్ గా చెప్పుకోవచ్చు.

Try This Homemade Serum To Prevent Hair Fall After Delivery Homemade Serum, Hai

డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ ను అరికట్టడానికి ఈ సీరం ఎంతో ఎఫెక్టివ్‌ గా పని చేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం సీరం ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Advertisement
Try This Homemade Serum To Prevent Hair Fall After Delivery! Homemade Serum, Hai

అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ), మూడు నుంచి నాలుగు ఎండిన మందార పువ్వులు, రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు మరియు ఐదారు లవంగాలు వేసి దాదాపు 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించాలి.

Try This Homemade Serum To Prevent Hair Fall After Delivery Homemade Serum, Hai

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన సీరం అనేది సిద్ధమవుతుంది.

ఈ సీరంను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.సీరం అప్లై చేసుకున్న గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ సీరంను వాడారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.జుట్టు రాలడాన్ని అరికట్టడం లో ఈ సీరం ఉత్తమంగా సహాయపడుతుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.హెయిర్ ఫాల్ కు చెక్ పెడుతుంది.

Advertisement

కాబట్టి డెలివరీ అనంతరం జుట్టు రాలడాన్ని అరికట్టాలి అనుకుంటే తప్పకుండా ఈ సీరం ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు