ఒకే ఒక్క వాష్ లో చుండ్రు పోవాలంటే ఈ రెమెడీని ట్రై చేయండి!

చుండ్రు( Dandruff ) అనేది అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.అందులోనూ ప్రస్తుత చలికాలంలో చుండ్రు మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటుంది.

చలి, పొడి చలి వాతావరణం చుండ్రును తీవ్రతరం చేస్తుంది.ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకోవడం కోసం రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఒకే ఒక్క వాష్ లో చుండ్రును పోగొట్టే అద్భుతమైన హోమ్ రెమెడీ ఒకటి ఉంది.

ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Try This Home Remedy To Get Rid Of Dandruff In One Wash Details, Home Remedy, D
Advertisement
Try This Home Remedy To Get Rid Of Dandruff In One Wash Details, Home Remedy, D

ముందుగా అంగుళం అల్లం( Ginger ) ముక్కను తీసుకుని పీల్ తొలగించి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో 4 రెబ్బలు వేపాకు( Neem Leaves ) వేసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేయాలి.

ఆపై ఈ వేపాకు అల్లం జ్యూస్ ను స్కాల్ప్ తో పాటు జట్టు మొత్తానికి బాగా అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

Try This Home Remedy To Get Rid Of Dandruff In One Wash Details, Home Remedy, D

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వేప ఆకులలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.ఇవి చుండ్రు మరియు పొడి స్కాల్ప్ నుండి బయటపడటానికి సహాయపడతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అలాగే అల్లంలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యే ఈస్ట్ ఇన్ఫెక్షన్‌ను నియంత్రిస్తాయి.అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రు వల్ల వచ్చే దురద నుండి ఉపశమనం కలిగిస్తాయి.

Advertisement

ఇక ఆముదం జుట్టుకు మాయిశ్చరైజింగ్ ల‌క్ష‌ణాల‌ను అదిస్తుంది.జుట్టు కుదుళ్ల‌ను పటిష్టం చేస్తుంది.

స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తుంది.ఫైన‌ల్ గా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్ర‌య‌త్నిస్తే చండ్రు స‌మ‌స్య‌కు గుడ్ బై చెప్పేయ‌వ‌చ్చు.

తాజా వార్తలు