డెలివరీ తర్వాత కరివేపాకుతో ఇది కలిపి రాస్తే హెయిర్ ఫాల్ పరార్ అవ్వ‌డం ఖాయం!

డెలివరీ అనంతరం చాలామంది ఆడవారు హెయిర్ ఫాల్ తో బాగా ఇబ్బంది పడుతుంటారు.జుట్టు విపరీతంగా ఊడిపోవడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.

హెయిర్ ఫాల్ ను ఎలా అడ్డుకోవాలో తెలియక తెగ సతమతం అయిపోతూ ఉంటారు.డెలివరీ అనంతరం జుట్టు అధికంగా రాలిపోవ‌డానికి అనేక కారణాలు ఉన్నాయి.

అలాగే జుట్టు రాలడాన్ని అడ్డుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్( Hair fall ) సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.

అందుకోసం ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు( onion slices ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ఉల్లిపాయ జ్యూస్ లో మూడు టేబుల్ స్పూన్లు కరివేపాకు పొడి( Curry powder ) మరియు వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్ సమస్య దెబ్బకు పరార్ అవుతుంది.కరివేపాకు ఉల్లి మరియు పెరుగులో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటాయి.ప్రసవం అనంతరం అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రెమెడీ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

మహేష్ బాబు, సూర్య క్లాస్ మేట్స్ అని మీకు తెలుసా.. ఈ హీరోలు చిన్నప్పుడు అలా ఉండేవార?
ఈరోజుతో మెగా ఫ్యామిలి తారల స్కోరు 11 .. ఓ క్రికేట్ టీమ్ తయారయ్యింది

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చుండ్రును సైతం వదిలించుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు