పెసలతో మీ అందం రెట్టింపు.. ఇలా వాడితే మోర్ బెనిఫిట్స్..!

పెసలు ( green gram )ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడంలోనూ పెసలు అద్భుతంగా సహాయపడతాయి.

అందాన్ని రెట్టింపు చేసే సత్తా పెసలకు ఉంది.మరి ఇంతకీ చర్మానికి పెసలను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్‌ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు పెసలు వేసి మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టీ స్పూన్లు పెసర పిండిని వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ మెత్తగా స్మాష్ చేసిన అరటిపండు( banana ), వన్ టేబుల్ స్పూన్ పాలు( spoon milk ) మరియు ఒక ఎగ్ వైట్( Egg white ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Advertisement

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ హోమ్ రెమెడీని కనుక ఫాలో అయ్యారంటే అదిరిపోయే స్కిన్ కేర్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.

పెస‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన క్లీన్సింగ్ ఏజెంట్‌గా ప‌నిచేస్తాయి.పెస‌లు చ‌ర్మాన్ని హైడ్రేట్ చేయ‌డంలో, పొడిబారిన చ‌ర్మాన్ని మృదువుగా మార్చ‌డంలో సాయ‌ప‌డ‌తాయి.సూర్య‌కాంతి వ‌ల్ల డార్క్ గా మారిన చ‌ర్మాన్ని రిపేర్ చేయ‌గ‌ల సామ‌ర్థ్యం కూడా పెస‌ల‌కు ఉంది.

అలాగే ఎగ్ వైట్ లో ఉండే పోష‌కాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేస్తాయి.య‌వ్వ‌నాన్ని కాపాడ‌తాయి.ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌ల‌కు చెక్ పెడ‌తాయి.

అర‌టి పండు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.అర‌టి పండులోని విటమిన్ సి మరియు లుటిన్ వంటి పోషకాలు స్కిన్ ఏజింగ్ ను ఆల‌స్యం చేస్తాయి.చ‌ర్మాన్ని ప్ర‌కాశ‌వంతంగా మారుస్తాయి.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

ఇక పాలు కూడా చ‌ర్మాన్ని అందంగా, నిగారింపుగా మార్చ‌డంలో తోడ్ప‌డ‌తాయి.

Advertisement

తాజా వార్తలు