వయసు పైబడిన యవ్వనంగా మెరిసిపోవాలి అనుకుంటే చియా సీడ్స్ తో ఇలా చేయండి!

ఏజ్ పెరిగిన కూడా యంగ్ గా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

కానీ ఆహారపు అలవాట్లు, కాలుష్యం, శరీరానికి శ్రమ లేకపోవడం, రసాయనాలతో నిండి ఉండే చర్మం ఉత్పత్తులను వాడటం తదితర కారణాల వల్ల ప్రస్తుత రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే ముఖంలో వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చియా సీడ్స్ చాలా బాగా సహాయపడతాయి.చియా సీడ్స్ లో ఉండే విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తాయి.

వయసు పైబడిన కూడా మీ చర్మాన్ని యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.మరి ఇంతకీ చియా సీడ్స్ ను చర్మానికి ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ మరియు అర కప్పు చల్లారిన గ్రీన్ టీ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్, గ్రీన్ టీ (Chia seeds, green tea)తో సహా వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ (Lemon juice)మరియు హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ చియా సీడ్స్ మాస్క్ ను వేసుకుంటే మస్తు లాభాలు పొందుతారు.

చియా సీడ్స్ అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.అకాల వృద్ధాప్యానికి చెక్ పెడ‌తాయి.

చర్మంపై ముడతలు, చారలు పడకుండా రక్షిస్తాయి.స్కిన్ ను టైట్ గా బ్రైట్ గా మారుస్తాయి.

యవ్వనంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.అలాగే ఈ మాస్క్ ను వేసుకోవడం వల్ల చియా సీడ్స్ లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!
Advertisement

తాజా వార్తలు