చియా సీడ్స్ తో చర్మానికి మెరుగులు.. ఇలా వాడారంటే అందంగా మెరిసిపోతారు!

చియా సీడ్స్( Chia Seeds ).వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

మన ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన గింజల్లో చియా సీడ్స్ ఒకటి.రోజుకు వన్ టేబుల్ స్పూన్ చొప్పున ఈ సీడ్స్ ను తీసుకుంటే బోలెడు ఆరోగ్య లాభాలు లభిస్తాయి.

అయితే చర్మ సౌందర్యాన్ని( Skin beauty ) పెంచడానికి కూడా ఈ గింజలు సహాయపడతాయి.చర్మ రక్షణలో ఖరీదైన ఉత్పత్తుల కన్నా చియా సీడ్స్ చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తాయి.

మరి ఇంతకీ చియా సీడ్స్ తో చర్మానికి ఎలా మెరుగులు పెట్టవచ్చు.అది అందించే ప్రయోజనాలు ఏంటి.

Advertisement
Try This Chia Seeds Mask For Beautiful And Youthful Skin! Chia Seeds, Beautiful

అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Try This Chia Seeds Mask For Beautiful And Youthful Skin Chia Seeds, Beautiful

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి ఒక కప్పు పాలు పోసుకుని అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసుకోవాలి.అలాగే నాలుగు అరటిపండు స్లైసెస్( Banana slices ), వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Try This Chia Seeds Mask For Beautiful And Youthful Skin Chia Seeds, Beautiful

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పట్టించి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ చియా సీడ్స్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

చియా సీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.అవి దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్ చేస్తాయి.చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తాయి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

అలాగే చియా సీడ్స్ చర్మంపై హైడ్రేటింగ్ ఎలిమెంట్‌గా పనిచేస్తాయి.వీటిని వాడటం వల్ల డ్రై స్కిన్ సమస్య దూరం అవుతుంది.

Advertisement

మరియు చియా సీడ్స్ మాస్క్ తో ముడతలు, చర్మం సాగటం వంటివి దూరం అవుతాయి.చర్మం అందంగా మరియు యవ్వనంగా మెరుస్తుంది.

తాజా వార్తలు