తమలపాకుతో చర్మానికి మెరుగులు.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా వాడండి!

తమలపాకులు.( Betel Leaves ) అనేక ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది.

తమలపాకులో విటమిన్ సి, థయామిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, నియాసిన్, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.ఆరోగ్యపరంగా తమలపాకులు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అయితే తమలపాకుల్లో ఎన్నో బ్యూటీ సీక్రెట్స్ కూడా దాగి ఉన్నాయి.చర్మాన్ని( Skin ) అందంగా మెరిపించడానికి తమలపాకులు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.

ముఖ్యంగా మొటిమలు మచ్చలకు చెక్ పెట్టే సత్తా తమలపాకులకు ఉంది.ఈ నేపథ్యంలోనే తమలపాకులతో చర్మానికి ఎలా మెరుగులు పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఐదు నుంచి ఆరు తమలపాకులను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న తమలపాకులు వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

పూర్తిగా కూల్ అయిన అనంత‌రం ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ హనీ,( Honey ) వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌( Lemon Juice ) వేసి బాగా మిక్స్ చేస్తే ఒక మంచి టోనర్ సిద్ధమవుతుంది.ఈ టోనర్ ను స్ప్రే బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మూడు నుంచి నాలుగు రోజుల పాటు వాడుకోవచ్చు.రోజూ ఉదయం మరియు రాత్రి నిద్రించే ముందు తయారు చేసుకున్న టోనర్ ను( Toner ) ముఖానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.

క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చ‌ర్మంపై మొండి మ‌చ్చ‌లు మాయం అవుతాయి.పిగ్మెంటేషన్ స‌మ‌స్య దూరం అవుతుంది.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025

మొటిమ‌ల త‌ర‌చూ వేధించ‌కుండా ఉంటాయి.అలాగే యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన తమలపాకులు అకాల వృద్ధాప్యం మరియు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.తమలపాకుల‌తో పైన చెప్పిన విధంగా టోన‌ర్ ను త‌యారు చేసుకుని నిత్యం వాడ‌టం చర్మం కాంతివంతంగా మార్చడంతో పాటు స్కిన్ టోన్ కూడా మెరుగుప‌డుతుంది.

Advertisement

తాజా వార్తలు